మేజర్ అజయ్ కృష్ణ టాప్ సీక్రెట్ లీక్

0

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన కథానాయిక. ఎఫ్ 2 ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనీల్ సుంకర- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ కశ్మీర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అంటూ అనీల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.

కశ్మీర్ షెడ్యూల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ట్రైన్ సెట్ లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. కశ్మీర్ నుంచి ఆంధ్రా వెళ్లే రైల్లో ఆర్మీ అధికారి మహేష్ కి .. ఇతర ప్రధాన తారాగణానికి .. మధ్య సాగే ఆసక్తికర సీక్వెన్సును తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ – విజయశాంతి మధ్య సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే విజయశాంతి ఇంటి సెట్ ని నిర్మిస్తున్నారు.

లేటెస్ట్ గా మహేష్ మిలటరీ గెటప్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆన్ లొకేషన్ నుంచి మహేష్ గెటప్ రివీలైన నిమిషాల్లోనే ఫ్యాన్స్ లో వైరల్ గా దూసుకెళ్లింది. తాజాగా ఈ పాత్ర పేరు కూడా రివీలైంది. మహేష్ పాత్ర పేరు మేజర్ అజయ్ కృష్ణ. ఆర్మీ అధికారి పాకెట్ పై ఉండే బ్యాడ్జ్ పై అజయ్ కృష్ణ అన్న పేరు ఉంది. ఇక ఈ పేరును సెలెక్ట్ చేసుకోవడానికి ఓ ఆసక్తికర కారణం రివీలైంది. దూకుడు లో అజయ్.. పోకిరిలో కృష్ణ మనోహర్ .. రెండూ కలిపి అజయ్ కృష్ణ అని పేరు పెట్టారు. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ నటన లో ఎలాంటి వైవిధ్యం చూడబోతున్నాం? అన్న ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతూనే ఓ చక్కని సందేశాన్ని ఇస్తున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer