హ్యాపీ బర్త్ డే చెప్పిన మహేష్ బాబు

0

మహేష్ బాబు తన సినిమాల డైరెక్టర్లతో చాలా సన్నిహితంగా ఉంటాడనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా తనకు హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్లపై మహేష్ ఓపెన్ గానే అభిమానం కురిపిస్తూ ఉంటాడు. కొరటాల శివపై మహేష్ తన అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోడు. ఈమధ్య వంశీ పైడిపల్లిపై అదేరకమైన అభిమానం చూపిస్తున్నాడు.

ఈమధ్య వంశీ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా మహేష్ తో కలిసి కూడా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకల నుండి ఒక ఫోటోను మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ “నిన్న రాత్రి భలేగా గడిచింది. వెరీ హ్యాపీ బర్త్ డే వంశీ. రాబోయే ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కు “థ్యాంక్ యూ ఫర్ ఎవిరిథింగ్ సర్” అంటూ రిప్లై ఇచ్చాడు.

మహేష్ బాబు – వంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మహర్షి’ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు వంశీ పనితీరు నచ్చడంతో మహేష్ వంశీతో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వంశీ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను తయారు చేయడంలో బిజీగా ఉన్నాడట.