డైరెక్టర్లతో బ్రాండ్ ప్రమోషనా? హవ్వ!

0

సెల్ఫీ బావుంది. కానీ అందులో సూపర్ స్టార్ మిస్సవ్వడమే బాలేదు. ప్చ్! అయినా సూపర్ స్టార్ స్థానంలో `హంబుల్` బ్రాండ్ నే సూపర్ స్టార్ ని చేశారు. ఈ తెలివైన ప్రచారాన్ని మెచ్చుకుని తీరాలి. బ్రాండింగ్ చేయడానికి కేవలం సూపర్ స్టార్ మహేష్ మాత్రమే కాదు.. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు టీమ్ మొత్తం రెడీ అవుతోందా? అన్న సందేహం కలుగుతోంది. శాంపిల్ కోసం ఇదిగో ఇలా దర్శకుడు అనీల్ రావిపూడి తో ఈ ప్రచారం మొదలైందనే అర్థమవుతోంది. అగ్గి పుల్ల గుగ్గిపుల్ల పిల్లి ఫిరంగి కాదేదీ హంబుల్ ప్రచారానికి అనర్హం! అన్నచందంగానే ఉందీ వ్యవహారం.

మొత్తానికి హంబుల్ బ్రాండ్ తో వస్త్రశ్రేణి వ్యాపారం ప్రారంభించిన మహేష్-నమ్రత జోడీ ప్రచారంలోనూ అదే తీరుగా నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. కెరీర్ 26వ సినిమా `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి మహేష్ కూడా ఒక నిర్మాత కాబట్టి ఇన్ ఫిలిం బ్రాండింగ్ లో హంబుల్ ప్రచారం హోరెత్తుతుందనడంలో సందేహం లేదు.

విత్ మై హంబుల్ డైరెక్టర్!! లొకేషన్ డైరీస్ .. సరిలేరు నీకెవ్వరు! అంటూ నమ్రత శిరోద్కర్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోని షేర్ చేశారు. హంబుల్ డైరెక్టర్ తో హంబుల్ ప్రచారం బావుందండోయ్. అన్నట్టు అనీల్ రావిపూడి హంబుల్ బ్రాండ్ టీషర్ట్ బావుంది. సరిలేరు.. ఆన్ లొకేషన్ కాస్ట్ అండ్ క్రూకి కూడా హంబుల్ టీషర్టులు జీన్స్ సరఫరా చేస్తే ప్రచారం మరింత పీక్స్ లో కలిసొస్తుందేమో!!
Please Read Disclaimer