ఎలుక తో ఎంటర్ టైన్ చేయబోతున్న మహేష్?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాలోని కొన్ని కీ పాయింట్స్ ను లీక్ చేయడం ద్వారా సినిమా పై జనాల్లో మరింత ఆసక్తి పెంచేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ కు పడి పడి నవ్వుతారు అంటూ ప్రచారం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా విజయశాంతి మాట్లాడుతూ ఖచ్చితంగా ట్రైన్ ఎపిసోడ్ కామెడీ ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇక సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటీ అనుకుంటున్న సమయం లో సినీ వర్గాల నుండి ఒక సమాచారం అందుతోంది. దాని ప్రకారం సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు ఒక ఎలుక తో చేసే మ్యాజిక్ అందరిని నవ్విస్తుందట. సెకండ్ హాఫ్ లో ఉండే ఆ ఎలుక సీన్ ఖచ్చితంగా హైలైట్ అవుతుందని అంటున్నారు.

అనీల్ రావిపూడి అంటేనే ఎంటర్ టైనర్ మాస్ మసాలా మూవీ. అందుకే ఎంటర్ టైన్ మెంట్ కు లోటు లేకుండా ఎక్కడ రాజీ పడకుండా మహేష్ బాబుతో కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా కామెడీ పండించినట్లుగా చెబుతున్నారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా విజయ శాంతి కీలక పాత్ర లో కనిపించబోతుంది. ఇక ఈ చిత్రం తో చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ కమెడియన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలోని బండ్ల గణేష్ పాత్ర చాలా విభిన్నంగా ఉండి నవ్వు తెప్పిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అనఫిషియల్ గా చెబుతున్నారు. మొత్తానికి సంక్రాంతికి మస్త్ ఎంటర్ టైన్ మెంట్ ను సరిలేరు నీకెవ్వరు అందించడం కన్ఫర్మ్ అంటూ మహేష్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
Please Read Disclaimer