ఈసారి దేవరకొండ కోసం మహేష్

0

మహేష్ బాబు మహర్షి చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాల్గొన్న విషయం తెల్సిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండకు రిటర్న్ గిఫ్ట్ గా మహేష్ బాబు ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ట్రైలర్ లాంచ్ చేసేందుకు ఓకే చెప్పారు. విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న మీకు మాత్రమే చెప్తా సినిమా పై ఒక వర్గం ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని మరింత పెంచేందుకు అన్ని వర్గాల వారి దృష్టిని ఆకర్షించేందుకు విభిన్నమైన ట్రైలర్ ను కట్ చేశారట.

ఆ ట్రైలర్ సూపర్ స్టార్ వంటి స్టార్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తే సినిమాకు మంచి పబ్లిసిటీగా భావించారు. అందుకే మహేష్ బాబు చేతుల మీదుగా ఈ చిత్రం ట్రైలర్ ను రేపు విడుదల చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే ఓకే చెప్పడంతో అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అక్టోబర్ 16న మహేష్ బాబు చేతుల మీదుగా మీకు మాత్రమే చెప్తా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నామంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

మీకు మాత్రమే చెప్తా చిత్రంలో కీలక పాత్రలో ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటించాడు. అనసూయతో పాటు ఇంకా ఈ చిత్రంలో పలువురు నటీనటులు నటించారు. విభిన్నమైన ఎంటర్ టైనర్ గా ఈ చిత్రంను దర్శకుడు సమీర్ తెరకెక్కించాడు. స్క్రిప్ట్ నచ్చడంతో తానే నిర్మించేందుకు విజయ్ దేవరకొండ ముందుకు వచ్చాడు. ఇక ఈ చిత్రంను నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.Please Read Disclaimer