మహేష్ ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

0

సహజంగా సంక్రాంతి పోటీలో ఉన్న ఏ సినిమాకు సంబందించిన హీరోని – డైరెక్టర్ ను కదిపినా సినిమా మీద తమ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ వారు తమది బెస్ట్ అంటే తమది బెస్ట్ అంటూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ కి సంబంధించి మహేష్ కూడా మీడియా ముందుకొచ్చి సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ బయటపెట్టాడు.

అవును ‘మహర్షి’ తర్వాత కమిట్ అయిన ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి మరీ అనిల్ ను లైన్ లో పెట్టాడట సూపర్ స్టార్. నిజానికి ఈ కథను ‘F2’ టైంలోనే మహేష్ కి చెప్పాడట అనిల్. నలబై నిమిషాల పాటు నరేషన్ ఇచ్చాడట. అయితే అప్పటికే ఇద్దరూ చెరొక సినిమా కమిట్ అయ్యారట. అవి పూర్తయ్యాక చేద్దామని మహేష్ అనిల్ కి చెప్పి పంపించాడట. కట్ చేస్తే ‘F2’ బ్లాక్ బస్టర్ అవ్వగానే అనిల్ కి ఫోన్ చేసి మొన్న మీరు చెప్పిన సినిమా ఇప్పుడే చేసేద్దామా కుదురుతుందా ? అని అడిగాడట. ఇక అనిల్ వెంటనే హ్యాపీ గా ఒకే అనేసాడట. ఈ విషయాన్ని లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకున్నాడు మహేష్.

ఇక తను ఆ టైంలో తీసుకున్న డిసిషన్ తన కెరీర్ లోనే బెస్ట్ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఆ మాటల్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. అంతే కాదు సినిమాలో కొత్త మహేష్ ని చూస్తారు అంటూ చెప్పాడు. అంత బాగానే ఉంది. కానీ మహేష్ కొత్తగా సరిలేరులో చేసిందేం లేదు. గతంలో ‘పోకిరి”దూకుడు”ఖలేజా’ లో చేసిందే మళ్ళీ చేసినట్టు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఇక మహేష్ చెప్పినవాటిలో నిజం ఎంతో తెలియలన్నా ఆయన డిసిషన్ బెస్ట్ అని అనిపించాలన్నా ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer