మహేష్ లో ఈ కోణం షాకిస్తుందంతే!

0

సూపర్ స్టార్ మహేష్ లోని క్లాసిజాన్ని మాసిజం ప్రతిసారీ డామినేట్ చేస్తుంటుంది. చూసేందుకు ఎంత క్లాస్ గా కనిపిస్తారో లోన అంత మాస్ దాగి ఉంటుందని తన సన్నిహితులు చెబుతుంటారు. మహేష్ మాట తీరులోనూ ఇది ప్రతిసారీ బయటపడుతూనే ఉంటుంది. ఆన్ లొకేషన్ మహేష్ హ్యూమరిజం పైనా స్పాంటేనియస్ గా పంచ్ లు వేస్తూ నవ్వించే తత్వంపైనా ఎందరో పొగడ్తలు కురిపించారు. ఇక మహేష్ ని మరో కొత్త కోణంలో చూసే టైమ్ వచ్చిందన్నది సరిలేరు టీమ్ చెబుతున్న మాట. ఇటీవలే రష్మిక.. మహేష్ ని ప్రొఫెషనల్ డాన్సర్ అని పొగిడేసింది.

అయితే అది నిజమేననిపించే మరో టాక్ బయటకు వచ్చింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు అన్ని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇందులో మహేష్- విజయశాంతి ఒకరితో ఒకరు పోటీపడి నటించారు. ఇక పాటల్లో మహేష్ మాస్ స్టెప్పులు ఇరగదీసాడన్న టాక్ వినిపిస్తోంది. అలాగే తమన్నాతో వచ్చే ఐటం సాంగ్ లో మిల్కీకి పోటీగా డాన్సులు చేసాడుట. మైండ్ బ్లాంక్ పాటలో నిజంగానే స్టెప్పులు చించి ఆరేశాడన్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ప్రతి పాటా దేనికదే వైవిధ్యంగా ఉంటుందట. విజువల్ గానూ అంతే బాగా కుదిరాయన్న టాక్ బయటకు వచ్చింది. ముఖ్యంగా మిలటరీ ఫేర్ వెల్ పార్టీలో వచ్చే ఐటం పాటలో సూపర్ స్టార్ తన మాస్ స్టెప్పులతో విజిల్స్ వేయించడం ఖాయమని తెలుస్తోంది. అనీల్ రావిపూడి మాసిజానికి మహేష్ మాస్ ఐడియాలజీ కలిసి వచ్చిందట. దర్శకుడు మాస్ పల్స్ బాగా తెలిసినవాడు కాబట్టి కంటెంట్ తో పాటు.. కంపోజింగ్ లోనూ అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాడట. మరి మహేష్ ఏ రేంజ్ లో డ్యాన్సులేశాడో జనవరి 11న థియేటర్లలో చూడాల్సిందే.
Please Read Disclaimer