దర్శకులతో ఇంత సన్నిహితంగా ఉన్నా కానీ!

0

సూపర్ స్టార్ మహేష్ తన దర్శకులతో ఎంతో సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. పాతిక సినిమాల కెరీర్ లో తనకు హిట్లిచ్చిన దర్శకులందరికీ `మహర్షి` ప్రచార వేదికపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్ ద స్క్రీన్ సైతం తనతో పని చేసిన దర్శకులతో కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి చనువుగా ఉంటారు. కొరటాల శివ.. వంశీ పైడిపల్లి.. అనీల్ రావిపూడి ఇలా స్టార్ డైరెక్టర్లతో మహేష్ సాన్నిహిత్యం తెలిసిందే. ఇటీవల మహర్షి చిత్రంతో తనకు వంశీ పైడిపల్లి ఎంత క్లోజ్ అయ్యారో చూశాం. అలాగే తనతో రచయితగా ఉన్నప్పుడే ఎంతో సన్నిహితుడైన అనీల్ రావిపూడికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న`సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో అనీల్ రావిపూడి మరింత క్లోజ్ అయ్యారు.

మహేష్ ఫ్యామిలీ ఫంక్షన్ ఏది జరిగినా ప్రస్తుతం ఈ దర్శకులు ఆ వేడుకల్లో కనిపిస్తున్నారు. నిన్న క్యూట్ సితార బర్త్ డే సందర్భంగా వంశీ పైడిపల్లి.. అనీల్ రావిపూడి మహేష్ కుటుంబంతో కలిసి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు. సితారకు విషెస్ తెలిపారు. మహర్షి సక్సెస్ తర్వాత వంశీ పైడిపల్లికి మహేష్ మరో ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ స్క్రిప్టు పనులు సాగుతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే సితార బర్త్ డే వేడుకల్లో వేరొక దర్శకుడు కనిపించారు. ఆయనే మెహర్ రమేష్. మహేష్ ని మెహర్ డైరెక్ట్ చేయలేకపోయినా ఆ ఫ్యామిలీ బ్యానర్ ప్రొడక్షన్ వ్యవహారాల్ని ఆయన చూస్తున్నారట. తనతో కలిసిపోయే వారందరికీ మహేష్ ఇచ్చే గౌరవం ఏంటో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అయితే అలాంటి మహేష్ పై ఓ ఇంటర్వ్యూలో పూరి చేసిన కామెంట్స్ ఈ సందర్భంగా ప్రస్థావనకు వచ్చాయి. మహేష్ హిట్ డైరెక్టర్లకే అవకాశాలిస్తారని ఫ్లాపుల్లో ఉంటే ఛాన్సివ్వరని పూరి సెటైరికల్ గా వ్యాఖ్యానించడం అభిమానుల్లో చర్చకొచ్చింది. అయితే పోకిరి-బిజినెస్ మేన్ లాంటి బ్లాక్ బస్టర్లను మహేష్ కి ఇచ్చిన దర్శకుడిగా పూరి అంటే ఫ్యాన్స్ కి అభిమానం చెక్కు చెదరలేదు. అయితే మహేష్ అవకాశం ఇస్తానన్నా తనతో పని చేయలేనని మరో మాట అన్నారు. అలా కాకుండా మహేష్ ని మెప్పించే స్క్రిప్టుతో వస్తారా అన్నది చూడాలి! పూరీతో తిరిగి మహేష్ కి ఆ సెలబ్రేషన్ ఎప్పటికి రానుందో..!!
Please Read Disclaimer