క్యూట్ సితార దీపావళి ట్రీట్

0

మహేష్ గారాల పట్టీ క్యూట్ సితార గురించి పరిచయం అవసరం లేదు. డాడ్ కి ధీటుగా సితార అభిమానుల్ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ సితార యాక్టివ్ గానే ఉంటోంది. స్కూల్ కి సెలవులు రాగానే.. మామ్ డాడ్ తో కలిసి విదేశీ విహారయాత్రలకు వెళుతూ నిరంతరం జాలీ లైఫ్ స్పెండ్ చేస్తోంది. ఆ ఫోటోలు.. వీడియోలు ప్రతిదీ నమ్రత మహేష్ స్వయంగా ఇన్ స్టా ద్వారా అభిమానులకు చేరవేస్తుంటారు.

తాజాగా క్యూట్ సితార భరతనాట్యం చేస్తున్న వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు నమ్రత. `డోలు భాజే…` అంటూ సాగే పాపులర్ హిందీ గీతానికి సితార నర్తించిన తీరు ఆకట్టుకుంది. క్యూట్ చబ్బీ రూపంతో సితార డ్యాన్స్ చేసి మైమరిపించింది. ఇది ఫ్యాన్స్ కి సిసలైన దీపావళి కానుక. ఇంట్లో తీరిక సమయాల్లో సీతా పాప క్లాసికల్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. నాట్యంలో శిక్షణ తీసుకుంటోందని దీనిని బట్టి అర్థమవుతోంది.

చదువుతో పాటు ఆటపాటలు ఉంటేనే కిడ్స్ కి రిలాక్సేషన్. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నారనే అర్థమవుతోంది. సితార స్వతహాగానే నాన్న కూచి అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫ్యామిలీ మొత్తం చేసిన ఓ వాణిజ్య ప్రకటనలో డాడ్ మహేష్ తో పాటు చిరునవ్వులు చిందిస్తూ సితార ఆకట్టుకుంది. ఇందిరమ్మ మనవరాలు ప్రియాంకకు ఉన్నంత ఇమేజ్ ఘట్టమనేని ఫ్యాన్స్ లో సితారకు ఉంది. మరి ఆ లెగసీని సితార ముందుకు తీసుకెళుతుందేమో!