మహేష్ వారసురాలు సితార సినిమాల్లోకి వస్తుందా?

0

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ రంగ ప్రవేశం చేశారు. తండ్రిని మించిన తనయుడని నిరూపించారు. నేడు టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా సత్తా చాటుతున్నారు. మహేష్ వారసుడు గౌతమ్ కూడా 1-నేనొక్కడినే చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. నూనూగు మీసాల వయసు నాటికి మహేష్ లానే రాజకుమారుడులా రెడీ అవుతాడు గౌతమ్. అయితే బేబి సితార కూడా బాలనటి అవుతుందా? సినీ ఎంట్రీ ఇస్తుందా? అంటే అందుకు నమ్రత ఆసక్తికర సమాధానమే ఇచ్చారు.

ఇన్ స్టాగ్రామ్ లో `మీ ప్రశ్న అడగండి` కార్యక్రమంలో పాల్గొని.. ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చిన నమ్రతను సితార గురించి ప్రశ్నించాడో అభిమాని. సితార నటనలో ప్రవేశించే వీలుందా? అన్న ప్రశ్నకు .. ఇప్పుడే చెప్పడం తొందర పాటు అవుతుందని నమ్రత అన్నారు. సితార యూట్యూబ్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. సంతోషం గా ఉంది అని వెల్లడించారు. సితార చానెల్లో మీరు అతిధి గా కనిపించేది ఎపుడు? అంటే.. తాను అతిథి ని సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటుందని వెల్లడించారు.

తన ఇష్టమైన హీరో మహేష్. తొలిగా ప్రపోజ్ చేసింది ఎవరు? అంటే చెప్ప లేమని తెలిపారు. ఇక అమ్మా నాన్నకు మహేష్ పరిచయం ఎలా? వాళ్లకు నచ్చాడా? అంటే.. తొలి చూపు లోనే వాళ్లు ప్రేమలో పడి పోయారు! అంటూ కొంటె గా సమాధానం ఇచ్చారు నమ్రత.
Please Read Disclaimer