నమ్రత అలా బెదరగొట్టడం నిజమేనా?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో చాలా పాపులర్. తన అల్లరికి సంబంధించిన విశేషాలను మహేష్.. నమ్రతలు రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు కాబట్టి అలా పాపులర్ అయింది. అల్లరి పనులే కాదు..టాలెంట్ విషయంలో కూడా సితార పాప సూపరే. రీసెంట్ గా ‘మురిపాల ముకుంద సరదాల సనందా… కన్నా నిదురించరా’ అనే ‘బాహుబలి’ పాటకు ఎంతో అందంగా డ్యాన్స్ చేయడంతో మహేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ వీడియోను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ఆ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇలా పాపులారిటీ ఉండడంతో రీసెంట్ గా ఒక ప్రముఖ యాడ్ ఏజెన్సీ వారు సితారను ఒక యాడ్ లో నటింపజేసేందుకు నమ్రతను సంప్రదించారని ఫిలిం నగర్ టాక్. కానీ నమ్రత చెప్పిన రెమ్యూనరేషన్ కు సదరు యాడ్ ఏజెన్సీ వారు బెదిరిపోయారట. ఇక మారు మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోయారట. ఇప్పుడే సితారను తెరపైకి తీసుకురావడం ఇష్టం లేకనే నమ్రత అలా చెప్పిందని.. అంతకుమించి ఇంకేమీ లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ నిజంగానే నమ్రత అలా ఎక్కువ రెమ్యూనరేషన్ చెప్పినా.. లేక యాడ్ ఏజెన్సీ క్యాస్టింగ్ ఏజెంట్ ను బెదరకొట్టడానికి చెప్పినా ఒకటి మాత్రం నిజం. సితార పాప మాత్రం అప్పుడే బుల్లి సూపర్ స్టార్ అయిపోయింది. తాత కృష్ణగారికి.. నాన్న మహేష్ కు తగ్గ వారసురాలే.. ఏం అనుమానం లేదు. లేకపోతే ఎంతో మంది సెలబ్రిటీ కిడ్స్ ఉంటె సితారకే అలాంటి ఆఫర్ ఎందుకు వస్తుంది?
Please Read Disclaimer