అడివి శేష్ తర్వాత శర్వానంద్ కి ఛాన్స్!

0

అడివి శేష్ గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ కి చెందిన జీఎంబీ బ్యానర్ కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మేజర్ ప్రారంభమైంది. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో చిత్రమిది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. మేజర్ చిత్రీకరణ ఎంతవరకూ పూర్తయింది? అన్నదానిపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే శర్వానంద్ హీరోగా మహేష్ తన జీఎంబీ ప్రొడక్షన్స్ కింద మరో సినిమాను నిర్మించాలని భావిస్తున్నారట.

అంతా అనుకున్నట్టు సాగితే.. మరో రెండు మూడు వారాల వ్యవధిలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సుందట. ప్రస్తుతం శర్వానంద్ కోసం జీఎంబీ బృందం స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉందట. అయితే కథాంశం ఎలాంటిది? అన్నది మాత్రం రివీల్ కాలేదు. హ్యాట్రిక్ ఫ్లాపులతో రేసులో వెనకబడినా శర్వాకి సినిమాలకేం కొదవేమీ లేదు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు చేతలో ఉన్నాయి. శ్రీకరమ్ మూవీ సహా ఓ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నాడు. తదుపరి మహేష్ బ్యానర్ లోనూ సినిమాని ఖాయం చేసుకున్నాడట.

హీరోగా బిజీగా ఉంటూనే మహేష్ వరుసగా సినిమాల్ని నిర్మించనున్నారు. `సర్కారు వారి పాట` ఈపాటికే సెట్స్ కి వెళ్లాల్సి ఉన్నా.. మహమ్మారీ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పరశురామ్ సహా చిత్రబృందం ఉత్సాహంగా ఉన్నా ఊహించని పరిణామమిది. డిసెంబర్ నాటికి మహేష్ సెట్స్ కెళ్లే వీలుందని చెబుతున్నారు.
Please Read Disclaimer