సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీట్!!

0

వెండితెరపై ఇప్పటివరకూ మహేష్ ద్విపాత్రాభినయం చేసిందే లేదు. ఆయన డబుల్ రోల్ లో కనిపిస్తే చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉన్నా అది ఎందుకనో కుదరనేలేదు. కొడుకు దిద్దిన కాపురంలో బాలనటుడిగా నటించినా హీరో అయ్యాక మాత్రం అస్సలు కుదరలేదు. ఇది నిజంగా అభిమానుల్ని నిరాశరిచేదే.

కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కి అదిరే ట్రీటిస్తున్నారు మహేష్. ఆయన ద్విపాత్రాభినయంతో థ్రిల్ చేయబోతున్నారు. అయితే అది పూర్తి స్థాయి సినిమాలో కాదు. కేవలం కమర్షియల్ ప్రకటనలో మాత్రమే. ప్రఖ్యాత ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజా ప్రకటన లో మహేష్ ద్విపాత్రాభినయం అదుర్స్ అనే చెప్పాలి. అన్నయ్యగా తమ్ముడిగానూ కనిపించి మహేష్ ట్రీటిచ్చారు.

పట్నంలో తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చిన అన్నయ్య అక్కడకు రాగానే .. డస్ట్ పట్టిన తమ్ముడి ఆఫీస్ టేబుల్ ని చూపించాడు. అంతేనా అక్కడే బాగా మాసిపోయిన గుడ్డల్ని వాషింగ్ మెషీన్లో ఉతుక్కోమని సలహా కూడా పడేశాడు. షాపింగ్ దద్దరిల్లిపోవాలంటూ పంచె కట్టిన కోరమీసం అన్నయ్య సాఫ్ట్ వేర్ తమ్ముడికి చెప్పడం ఆకట్టుకుంది. ఈ ప్రకటనలో మహేష్ అల్ట్రా మోడ్రన్ గా స్టైలిష్ గా ఇస్మార్ట్ గానూ ఉన్నాడు. ఇంతకుముందెపుడూ తన సినిమాల్లోనే ఇలా కనిపించలేదే! అన్నంత గ్లామరస్ గా కనిపిస్తున్నాడు. పంచెకట్టు మెలితిరిగిన మీసాలతో మరింత అందంగా కనిపించడంతో పాటు.. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడంతో ఈ ప్రకటన బ్లాక్ బస్టర్ కొట్టింది. అన్నట్టు ఆ యాడ్ లో బ్యాచిలర్ తమ్ముడికి అన్నయ్య సలహాలు బావున్నాయి కానీ ఇండియాలో బ్యాచిలర్లు అంతా ఇంతేనా? అని అవమానించినట్టు కూడా ఉంది మరి.

కెరీర్ సంగతి చూస్తే.. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఏడాదిగా తదుపరి చిత్రం గురించిన ప్లానింగ్ తోనే సరిపోయింది. సెట్స్ కెళదామంటే ఈలోగానే మహమ్మారీ మీద పడింది. ఇపుడు పరశురామ్ దర్శకత్వంలో `సర్కార్ వారి పాట` చిత్రీకరణకు వెళ్లనుంది.