సితార పాప ఫుల్ హ్యాపీస్!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలతో.. ఇతర కమిట్మెంట్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ఏమాత్రం గ్యాప్ దొరికినా కుటుంబంతో సమయం గడుపుతారు. ఇక మహేష్ ముద్దుల కూతురు సితార పాప అల్లరి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సితార పాప సోషల్ మీడియాలో చాలా ఫేమస్.

ఇప్పుడు అందరూ హోమ్ ఇసోలేషన్లు.. హోమ్ క్వారంటైన్లు కదా. వాటికి తోడు పీఎం మోడీ గారు 21 రోజుల లాకు డౌను వ్రతం సూచించారు. జస్ట్ సూచించడమే కాకుండా ఇలాంటి వ్రతాలను అందరి చేత బలవంతంగా పట్టించారు. వ్రతాలను నమ్మేవారు సరే కానీ అస్సలు నమ్మని జనాలు కూడా 21 రోజులు ఇంట్లో కూర్చోవాల్సిందే. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ కూడా ఇలాంటి 21 లాక్ డౌన్ లోనే ఉందట. నమ్రత తాజాగా తన ఇన్స్టా పోస్ట్ లో “21 రోజుల లాక్ డౌన్ అనే మాట వినగానే సితార పాప రియాక్షన్ అది. తన ఫేవరేట్ అయిన నాన్నతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కిన ఆనందంలో మహేష్ ను వదలడం లేదు” అని క్యాప్షన్ ఇస్తూ ఒక ఫోటో పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలో సితార పాప పకపకా నవ్వుతూ.. నాన్న చెవిలో ఏదో చెప్తూ తన స్టైల్ లో హంగామా చేస్తోంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూతురి దగ్గరకు వచ్చేసరికి ఓ సాధారణ తండ్రిగా మారిపోతాడు కదా.. మహేష్ కూడా సరిగ్గా అలాగే ఉన్నాడు. ఈ ఫోటోకు చాలామంది లైక్స్ తో.. కామెంట్స్ తో తమ జేజేలు తెలిపారు. కానీ కొందరు మాత్రం “మహేష్ కోవిడ్ -19 అవేర్ నెస్ వీడియో రిలీజ్ చెయ్యాలి”.. “జనతా కర్ఫ్యూ రోజు చప్పట్లు కొట్టారా లేదా?” ఇలాంటి ప్రశ్నలు.. డిమాండ్లు నమ్రత ముందు ఉంచారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-