విలన్ లా చిల్ అవుతోంది!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో ఆమె ఎప్పుడూ టచ్ లో ఉంటారు. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ ఇటలీలోని లేక్ కోమోలో ఉంది. అక్కడ ఉన్న బ్యూటిఫుల్ నేచర్ ను ఎంజాయ్ చేయడమే కాకుండా కొన్ని ఫోటోలను కూడా నమ్రత తన ఇన్స్టా ఖాతా ద్వారా పంచుకున్నారు.

నమ్రత లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోకు “విలన్ లాగా సరదాగా.. #కోమో.. యింగ్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫోటోలో సితార పాప రెయిలింగ్ ను పట్టుకుని సీనరీని చూస్తూ నిలుచుంది. నేపథ్యంలో చెరువు.. పెద్ద కొండలు.. లొకేషన్ అదిరిపోయింది. ఈ ఫోటోనే కాదు. ఇంకో ఫోటోలో సితార పాపతోపాటు గొడుగులు పట్టుకొని నిలుచుని భలే భలే పోజుచ్చారు. మరో ఫోటోలో ఇద్దరూ పిల్లలతో కలిసి నడుస్తూ పోజిచ్చారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలో గౌతమ్ చిరునవ్వులు చిందిస్తూ ఉండడం విశేషం. ఈ ఫోటోకు నమ్రత “ఇవన్నీ విభిన్న తరహా ఎస్టేట్లు.. లైమ్.. రబ్బర్ చెట్లు ఒక వైపు.. చెరువు మరోవైపు ఎంతో అందంగా ఉంది”అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ ఫోటోలకు నెటిజన్ల రెస్పాన్స్ కూడా సూపర్ గా ఉంది. హ్యాపీ ఫ్యామిలీ.. స్వీట్ కిడ్స్ అంటూ నెటిజన్లు మెచ్చుకున్నారు. కొంతమంది గౌతమ్ వాకింగ్ స్టైల్ మహేష్ లాగానే ఉందని పోలికలు తీసుకొచ్చారు.
Please Read Disclaimer