మెగా సూపర్ దంపతులు

0

స్టార్ల మధ్య వృత్తిగతమైన పోటీ ఉన్నా.. వ్యక్తిగత స్నేహాలకు.. కుటుంబాల మధ్య రిలేషన్ షిప్స్ కి అది అడ్డంకి కాకపోవడం ఆసక్తికరం. ఇటీవలి కాలంలో మన స్టార్ హీరోలంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్లలో ఒకరు తప్పనిసరిగా కనిపించి ఆప్యాయతను చూపిస్తున్నారు. మంచి స్నేహసుహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒకరి సినిమాల రిలీజ్ లకు ఇంకొకరు సాయం చేస్తూ పోటీని ఆరోగ్యకరంగా మలిచారు. ఇదే ఛేంజ్ అభిమానుల్లోనూ కనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే అభిమానంలోనూ కొత్త వెర్షన్ కనిపిస్తోంది.

టాలీవుడ్ లో డజను మంది టాప్ స్టార్లు ఒకరితో ఒకరు ఎంతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇక మహేష్ – రామ్ చరణ్ స్నేహం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆ ఇరు కుటుంబాల్లో ఫ్యామిలీ బాండింగ్ బలంగా ఉంది. చరణ్ ఇంట ఏ ఫంక్షన్ జరిగినా దానికి మహేష్ -నమ్రత దంపతులు ఎటెండవుతుంటారు. మహేష్ ఇంట జరిగే ప్రతి ఈవెంట్ కి రామ్ చరణ్ – ఉపాసన దంపతులు హాజరవుతుంటారు. ఇటీవలే మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ లాంచింగ్ కి చరణ్ క్లాప్ కొట్టి ఆశీర్వదించారు. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అటెండవుతున్న సంగతి తెలిసిందే. దానిని మెగా సూపర్ ఈవెంట్ గా నామకరణం చేశారు.

ఇదిగో లేటెస్టుగా రామ్ చరణ్ కొత్త ఇంట్లో మహేష్ – నమ్రత దంపతులు ప్రత్యక్షమయ్యారు. అక్కడ చరణ్-ఉపాసన దంపతులతో కలిసి ఓ స్నాప్ కి ఫోజిచ్చారు. ఈ ఫోటో చూశాక.. `మెగా సూపర్ దంపతులు` అని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. కెరీర్ పరంగా మహేష్.. చరణ్ ఎవరి బిజీలో వాళ్లు ఉన్నారు. చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్ `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుండగా.. ఆర్.ఆర్.ఆర్ 2020 జూలై 30న రిలీజవుతోంది.
Please Read Disclaimer