డైరెక్టర్ ని ఆడుకున్న గంగవ్వ

0

ప్రతిసారీ ఒకేలా ప్రమోషన్ చేస్తే బోరింగ్ అని భావించారో ఏమో ఇటీవల మన దర్శకనిర్మాతలు రకరకాల కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ కి దర్శకుడు అనీల్ రావిపూడి ఎంచుకున్న కొత్త విధానం ప్రశంసలు అందుకుంటోంది.

ఇంతకుముందు ఆన్ లొకేషన్ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రకరకాల స్కిట్ లు తెరకెక్కించి దాంతోనే ప్రమోషన్ చేసేశారు రావిపూడి. ఇప్పుడు ఏకంగా గంగవ్వను ఆన్ లొకేషన్ కి ఆహ్వానించి తెలివైన ప్రచారానికే శ్రీకారం చుట్టారు. సరిలేరు నీకెవ్వరు సెట్స్ లో `మై విలేజ్ షో ఫేం` గంగవ్వ సందడి చేశారు. చూడటానికి ఎంతో అమాయకంగా కనిపిస్తున్న అవ్వ అనీల్ రావిపూడిని రకరకాల ప్రశ్నలతో ఆడేసుకున్నారంతే. ఎఫ్ 2 గురించి .. సరిలేరు నీకెవ్వరు గురించి రకరకాల యక్ష ప్రశ్నలు అడిగింది అవ్వ. ఇతర చిత్రయూనిట్ తో మాట్లాడి తెగ సందడి చేసింది. ఆన్ లొకేషన్ జనాల్లో హుషారు నింపింది.

ఎవలు నువ్వు? ఈడెందుకు ఉన్నవ్? .. అంటూ తన అమాయక మాటలతో ఆకట్టుకుంది. నన్ను హీరోయిన్గా పెట్టుకుని సినిమా తీస్తావా? అంటూ అనీల్ రావిపూడిని ప్రశ్నించింది అవ్వ. అది విలేజ్ సెట్ విజయశాంతి నివశించే ఇల్లు అది.. అక్కడ ఆన్ లొకేషన్ ఏమేమి జరుగుతోందో ఈ వీడియోలో ఆవిష్కరించారు. సూపర్ స్టార్ మహేష్ – విజయశాంతిని కలిసి వారితో ఫొటోలకు ఫోజిచ్చింది గంగవ్వ. సినిమాలు మానేసిన విజయశాంతి ఇప్పుడు చేయడం లేదా? నేను కూడా చేస్తా! అంటూ.. గంగవ్వ సరదా సరదాగా మాట్లాడుతూ ఆకట్టుకుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Please Read Disclaimer