అనీల్ రావిపూడి ఈసారేం చేస్తాడో ?

0

కొంతమంది దర్శకుల నుండి ఏదైనా సంథింగ్ స్పెషల్ ఎక్స్ పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. ముఖ్యంగా వారి గత సినిమాల్లో వుండే పంచ్ లైన్స్ నెక్స్ట్ సినిమాలో ఊహిస్తారు. ఇప్పుడు అనిల్ రావిపూడి చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ విషయంలో అదే ఊహిస్తున్నారు ఫ్యాన్స్.

ప్రతీ సినిమాలో ఏదొక పంచ్ లైన్ తో ఫన్ క్రియేట్ చేస్తుంటాడు అనిల్. పటాస్ నుండి F2 వరకూ అనిల్ రావిపూడి ఫన్ పంచ్ లైన్స్ భలే పేలాయి. ఇక వాటిని టీజర్ ట్రైలర్స్ లో వదిలేసి ముందు నుండే ఆ లైన్స్ ను ప్రమోట్ చేస్తాడు అనిల్. అయితే ఈసారి మహేష్ తో అలాంటి పంచ్ లైన్స్ ఏవైనా చెప్పిస్తాడేమో నాని ఎంతో ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

సాయంత్రం 5 గంటలకు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ వదులుతున్నారు. రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్నారు. మరి ఈ టీజర్ లో అనిల్ పంచ్ లైన్స్ కామెడీ సీన్స్ ఎలా పేలతాయో సినిమాపై ఏ రేంజ్ బజ్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
Please Read Disclaimer