టాలీవుడ్ చరిత్రలోనే మహేష్ మొదటి సారి..!

0

సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 5వ తారీకున భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సూపర్ వేడుకకు మెగాస్టార్ అతిథి అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. చిరంజీవి ముఖ్య అతిథిగా సరిలేరు నీకెవ్వరు కార్యక్రమం వైభవంగా జరుగబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

సరిలేరు నీకెవ్వరు అనేలా ఈ ఈవెంట్ ఉంటుందని మొదటి నుండే చెబుతున్నారు. ఇప్పుడు ఈవెంట్ గురించిన మరో ఆసక్తికర విషయంను నిర్మాత అనీల్ సుంకర అధికారికంగా ప్రకటించాడు. ఈ వేడుకకు హోస్ట్ గా మహేష్ బాబు వ్యవహరించబోతున్నాడట. మొదటి నుండి కాదు కాని చివర్లో ముఖ్య అతిథిని మరియు ఇతర టెక్నీషియన్స్ నటీనటులను పిలిచే సమయంలో మహేష్ బాబు హోస్ట్ గా మారిపోబోతున్నాడట. ఇప్పటి వరకు ఏ హీరో కూడా తన మూవీ ప్రమోషనల్ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించలేదు. మొదటి సారి మహేష్ బాబు తన సినిమా వేడుకకు తానే హోస్ట్ గా మారబోతున్నాడు అంటూ అనీల్ రావిపూడి పేర్కొన్నాడు.

టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో చేయని పనిని మహేష్ బాబు చేయబోతున్నాడు. కనుక ఇది నిజంగానే సరిలేరు నీకెవ్వరు అనిపించుకోవడం ఖాయం అంటున్నారు. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతుండగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి తెరకెక్కించాడు. సంక్రాంతి పండుగను ఈ చిత్రం డబుల్ త్రిబుల్ చేస్తుందనే నమ్మకంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ బాబు హోస్టింగ్ చేస్తే అంచనాలు మరింతగా పెరగడం కన్ఫర్మ్ అంటున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు హోస్టింగ్ అనుభవం లేని మహేష్ బాబు మొదటి సారి గెస్ట్ లను ఎలా పిలుస్తాడో చూడాలి.
Please Read Disclaimer