సూపర్ స్టార్ కారవాన్

0

లగ్జరీ విషయంలో టాలీవుడ్ స్టార్లు బాలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోరు. పెద్ద స్టార్ హీరోలకు సొంత కారవాన్ లు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకూ అది చాలా కామన్. ఈ విషయంలో మన తెలుగు స్టార్లు బాలీవుడ్ స్టార్లకంటే ఎక్కువగా ఖర్చుపెడుతూ అత్యాధునిక వసతులతో కస్టమ్ మేడ్ కారవాన్లను సొంతం చేసుకుంటూ అందరినీ ఆకర్షిస్తున్నారు. కొంతకాలం క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఫాల్కన్’ అనే పేరుతో ఒక విలాసవంతమైన కారవాన్ ను సొంతం చేసుకున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక లగ్జరీ కారావాన్ ను కొనుగోలు చేశారట.

గతంలో కూడా మహేష్ కు ఒక కారవాన్ ఉండేది కానీ ఇప్పుడు అంతకంటే మెరుగైన వసతులు ఉండేలా కొత్త కారవాన్ డిజైన్ చేయించుకున్నారట. ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ దిలీప్ ఛాబ్రియా మహేష్ అభిరుచులకు తగ్గట్టుగా కారవాన్ ను డిజైన్ చేయించి ఇచ్చారట. అవుట్ డోర్ షూట్ లకు హాజరైన సమయంలో మహేష్ విశ్రాంతి తీసుకునే ఏర్పాట్లతో పాటుగా షూటింగ్ సమయంలో మహేష్ కుటుంబ సభ్యులు కూడా హాయిగా గడపగలిగేలా కారవాన్ డిజైన్ చేయించారట. ఇందులో అన్ని రకాల వసతులు ఉన్నాయట. టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ కారవాన్ అత్యంత ఖరీదైనదని అంటున్నారు. అయితే మహేష్ ఇతర హీరోల తరహాలో తన కారవాన్ గురించి సోషల్ మీడియాలో వెల్లడి చేయలేదు. అయినా మహేష్ లగ్జరీ కారవాన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer