నిజ జీవితంలోనూ సూపర్ స్టార్ అని నిరూపించుకున్న మహేష్

0

శ్రీమంతుడు’ సినిమా సూపర్ స్టార్ మహేష్ జీవితంపై చాలా ప్రభావం చూపింది. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు లో సేవా గుణం అంతకుముందు కంటే ఎన్నో రెట్లు పెరిగింది. గుంటూరు జిల్లాలో తన స్వంత గ్రామమైన ‘బుర్రిపాలెం’ ఊరిని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేశాడు. అంతేకాదు తెలంగాణాలో కూడా ఒక ఊరిని దత్తత తీసుకున్నాడు మహేష్ బాబు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు ఆపరేషన్స్ చేయించి వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇచ్చాడు మన ప్రిన్స్. తాను సినిమాలో మాత్రమే సూపర్ స్టార్ ని కాదని బయట కూడా తాను సూపర్ స్టార్ నే అని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తున్నాడు మహేష్.

ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన 13 నెలల సందీప్ అనే బాబుకి గుండె ఆపరేషన్ చేయిస్తున్నాడు మహేష్. ఈ బాబు గుండెలో మూడు రంధ్రాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టం అని డాక్టర్స్ అంటున్నారు. కానీ ఆ బాబు తల్లితండ్రుల ఆర్ధిక స్థోమత అంతంత మాత్రమే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మహేష్ సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆ బాబు గురించి మహేష్ కి చెప్పడంతో ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయినా తానే భరిస్తానని ముందుకొచ్చాడు. దీంతో త్వరలోనే విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ లో ఆ బాబుకి ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. మహేష్ చేసిన సాయానికి బాబు తల్లితండ్రులు ఎంతో ఉద్వేగంతో ఉన్నారు. మహేష్ చేసిన సాయానికి తాము రుణపడి ఉంటామని అంటున్నారు.
Please Read Disclaimer