మెహర్ కు మహేష్ అంత సాయం చేశాడా?

0

మెహర్ రమేష్ ను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చి పోలేరు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు మెహర్ ను ఎప్పటికి మర్చిపోలేరు. ఎందుకంటే ఎన్టీఆర్ కు మెహర్ రమేష్ ‘కంత్రి’ మరియు ‘శక్తి’ వంటి రెండు డిజాస్టర్ చిత్రాలను ఇచ్చాడు. ఆ సినిమాలతో మెహర్ రమేష్ ను స్టార్ హీరోలు పక్కన పెట్టారు. చిన్న హీరోలు సైతం మెహర్ తో వర్క్ చేసేందుకు భయపడుతున్నారు. కాని స్క్రిప్ట్ చర్చలు మరియు కథ చర్చలకు పలువురు హీరోలు మెహర్ రమేష్ ను పిలుస్తారని టాక్ ఉంది.

మెహర్ రమేష్ కొన్ని సినిమాల నిర్మాణంలో కూడా వేలు పెట్టాడట. దాంతో ఆయనకు అప్పులు అయ్యాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది. చాలా కాలంగా ఆ అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్న మెహర్ కు మహేష్ బాబు తన సరిలేరు నీకెవ్వరు చిత్రం రైట్స్ ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు పెట్టుబడి పెట్టి సరిలేరు నీకెవ్వరు రెండు ఏరియాల రైట్స్ ను కొని పెట్టాడట. సినిమా హిట్ కొట్టడం తో పెట్టిన పెట్టుబడి తో పాటు అదనంగా కొంత మొత్తం మహేష్ బాబు కు తిరిగి ఇచ్చేయగా మెహర్ రమేష్ కు దాదాపుగా కోటిన్నర వరకు మిగిలినట్లు గా టాక్ వినిపిస్తుంది.

ఆ మొత్తంతో మెహర్ రమేష్ తన అప్పులను తీర్చుకుని ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మెహర్ రమేష్ తో చాలా కాలంగా మహేష్ బాబు చాలా స్నేహంగా ఉంటూ వస్తున్నాడు. మహేష్ బాబుకు సంబంధించిన సినిమా కథ చర్చల నుండి మొదలుకుని ఆయన వ్యాపారాల వరకు అన్నింట్లో కూడా మెహర్ రమేష్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని.. వాటిని మెహర్ రమేష్ చూసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అది నిజం కనుకే మహేష్ బాబు ఇంతటి సాయం మెహర్ రమేష్ కు చేసి ఉంటాడంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer