మహేష్ బాబు రియల్ సూపర్ స్టార్ : విజయశాంతి

0

సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న విజయశాంతి చాలా ఎమోషనల్ గా అందరిని ఆకట్టుకునే విధంగా ప్రశంగించారు. ఆమె తన ప్రసంగంలో ఎక్కువగా మహేష్ బాబును ప్రశంసలతో ముంచెత్తారు. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ గారు అయితే మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ తో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నది మహేష్ బాబు అంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో మహేష్ బాబుతో వర్క్ చేయడం జరిగింది. మహేష్ బాబు ముట్టుకుంటే కందిపోతాడా అన్నట్లుగా ఉండేవాడు.

మహేష్ బాబు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అతడు ప్రతి మాట డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా ఉంటాయని చెప్పుకొచ్చింది. సూపర్ స్టార్ అనే పదానికి నిజమైన అర్థం అంటే ఖచ్చితంగా అది మహేష్ బాబు అని చెప్పదల్చుకున్నాను. మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలిసి ఆశ్చర్య పోయాను. నిజంగా వెయ్యి మంది పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించడం అంటే మామూలు విషయం కాదు. సినిమాలో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా మహేష్ బాబు సూపర్ స్టార్ అని కొనియాడింది.

మహేష్ బాబును ఎక్కువగా బాబు అంటూ సంబోధిస్తూ విజయశాంతి తన ప్రసంగంను కొనసాగించడం జరిగింది. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఉంటే నీ కొడుకుతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ బాబును ఉద్దేశించి విజయశాంతి అన్నారు. మూడు తరాల వారితో సినిమా చేసిన అవకాశం నాకు కావాలని కోరుకుంటున్నట్లుగా ఆమె అన్నారు. మొత్తానికి ఆమె ప్రసంగం.. అందులో మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలతో ఎల్బీ స్టేడియం దద్దరిల్లింది.
Please Read Disclaimer