సౌత్ ఇండియా నుండి మహేష్ ఒక్కడే

0

మహేష్ సరిలేరు నీకెవ్వరు మొదటిరోజు రికార్డు వసూళ్లు సాధించింది. చాలా ఏరియాలలో మహేష్ కెరీర్ బెస్ట్ మరియు నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదయ్యాయి. యూఎస్ బాక్సాఫీస్ కింగ్ గా మహేష్ ఓ అరుదైన ఫీట్ ని సొంతం చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజే 1 మిలియన్ వసూళ్లను దాటి వేసింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మహేష్ 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద వన్ మిలియన్ సాధించిన హీరోగా నిలిచాడు. సౌత్ ఇండియా లోనే పది సార్లు వన్ మిలియన్ సాధించిన హీరోలు లేరు. యూఎస్ మార్కెట్ లో బారి డిమాండ్ కలిగిన మహేష్ ఆ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

సరిలేరు నీకెవ్వరు తెలుగు రాష్ట్రాలలో కూడా వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా, లేడీ అమితాబ్ విజయ శాంతి కీలక రోల్ చేశారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.
Please Read Disclaimer