అసురన్.. ఖైదీ.. కమల్.. ఏంటి మహేష్ ఇది?

0

ఈమద్య కాలంలో మహేష్ బాబు తమిళ సినిమాల గురించి పాజిటివ్ గా స్పందించాడు. ధనుష్ నటించిన అసురన్ మరియు కార్తీ నటించిన ఖైదీ సినిమాలను ఆకాశానికి ఎత్తినట్లుగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఆ సినిమాలు బాగా నచ్చాయంటూ ట్వీట్స్ చేశాడు. ఇక నేడు కమల్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఒక గొప్ప నటుడు సినీ రంగానికి మీరు అందించిన సహకారం అద్వితీయం అంటూ పొగడ్తలు కురిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

కమల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంను తామేం తప్పుపట్టడం లేదని కాని నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు త్రివిక్రమ్ మరియు స్టార్ హీరోయిన్ అనుష్కల పుట్టిన రోజు. వీరిద్దరు కూడా మహేష్ బాబుతో కలిసి వర్క్ చేశారు. ముఖ్యంగా త్రివిక్రమ్ అతడు వంటి ఒక విభిన్నమైన మంచి సినిమాను ఇచ్చాడు. నాకు త్రివిక్రమ్ మంచి స్నేహితుడు అని కూడా మహేష్ అంటూ ఉంటాడు. మరి ఎందుకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ చెప్పలేదు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

తమిళ స్టార్స్ పై ఉన్న అభిమానం తెలుగు స్టార్స్ వద్దకు ఉండటం లేదేం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రజినీకాంత్ దర్బార్ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించేందుకు సిద్దం అయిన మహేష్ బాబుకు మన స్టార్స్ సినిమాలు పట్టవు మరియు మన స్టార్స్ బర్త్ డే లు పట్టవా అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబుపై కొందరు చేస్తున్న విమర్శలను ఆయన ఫ్యాన్స్ తిప్పి కొడుతున్నారు. త్రివిక్రమ్ ఖచ్చితంగా మహేష్ బాబుకు చాలా ఆప్తుడు. అలాంటి వ్యక్తికి డైరెక్ట్ గా ఫోన్ చేసి మహేష్ విషెష్ చెప్పి ఉంటాడని.. అందులో ఎలాంటి అనుమానం లేదు. మద్యలో మీరు ఎందుకు ఇది అవుతున్నారు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ రివర్స్ ఎటాక్ అవుతున్నారు.

ఇక నచ్చిన సినిమాల గురించి స్పందించినా కూడా తప్పేనా.. గతంలో మహేష్ బాబు పలుసార్లు తెలుగు సినిమాలపై కూడా పాజిటివ్ రివ్యూలు ఇచ్చాడు. ఆ విషయాలను పట్టించుకోకుండా కొన్నింటిని చూస్తూ మీరు మహేష్ బాబును ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ యాంట్రీ ఫ్యాన్స్ ను హెచ్చరిస్తున్నారు.
Please Read Disclaimer