‘రంగస్థలం’ రికార్డులు కొట్టేది ఎవరు?

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `రంగస్థలం` ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన సంగతి తెలిసిందే. నాన్ బాహుబలి కేటగిరీలో ఈ చిత్రం ఇంటా బయటా (ఓవర్సీస్) ఇప్పటికీ నంబర్ 1 సినిమాగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 120 కోట్ల షేర్ వసూలు చేయడం ఓ సెన్సేషన్. ఆ రికార్డు అలానే పదిలంగా ఉంది. ఆ తర్వాత రిలీజైన మహేష్ `భరత్ అనే నేను` బాక్సాఫీస్ వద్ద 95 కోట్ల షేర్ వసూలు చేసింది కానీ `రంగస్థలం` ఫుల్ రన్ రికార్డుల్ని కొట్టేయలేకపోయింది. అరవింద సమేత 100కోట్ల షేర్ గురించి – గీత గోవిందం ఓవర్సీస్ రికార్డులు (100 కోట్ల గ్రాస్) రికార్డుల గురించి చర్చ సాగినా `రంగస్థలం` రికార్డుల్ని కొట్టేశాయన్న మాట వాస్తవంగా ట్రేడ్ లో వినిపించలేదు.

అందుకే ఇప్పటికీ ఆ రికార్డును కొట్టే సినిమా ఏది? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంటుంది. అయితే ఈ సమ్మర్ సెలవుల్లో రిలీజ్ లకు రెడీ అవుతున్న వాటిలో ఏ సినిమాలకు రికార్డులు కొట్టే సీన్ ఉంది? అంటే ఒకే ఒక్క సినిమా గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `మహర్షి` ఈ సీజన్ లో రికార్డుల్ని తిరగరాస్తుందని ఘట్టమనేని అభిమానులు భావిస్తున్నారు. దిల్ రాజు- పీవీపీ- అశ్వని దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ చివరిలో రిలీజ్ కావాల్సినది ఎలక్షన్ తర్వాత రిలీజ్ చేస్తే మంచిదని ముందు చూపు చూశారు. ఆ మేరకు మే 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని దిల్ రాజు ప్రకటించారు. అయితే వాయిదా అనంతరం వస్తున్న ఈ సినిమా రంగస్థలం రికార్డుల్ని కొట్టేస్తుందా? కొత్త రికార్డుల్ని అందుకుంటుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

మార్చి 29న `లక్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజవుతుందా లేదా? అన్నదానిపై ఓవైపు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆర్జీవీ -లక్ష్మీస్ ఎన్టీఆర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు తెచ్చినా .. రంగస్థలం స్థాయితో పోల్చలేం. ఇకపోతే పరాజయాల బాటలో ఉన్నా చై- సామ్ జంట నటించిన `మజిలి` చక్కని ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే వసూళ్ల పరంగా రికార్డులు కొట్టేంత సీన్ ఉంటుందా? అంటే.. చై కెరీర్ బెస్ట్ అయ్యేంతవరకూ ఛాన్స్ ఉంటుంది. ఏప్రిల్ 5 న మజిలీ రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుసగా అరడజను ఫ్లాపుల్లో నటించిన సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి ఏప్రిల్ 12 న రిలీజవుతోంది. అటుపై నాని నటిస్తున్న జెర్సీ .. లగాన్ తరహాలో ప్రయోగాత్మక చిత్రం. ఏప్రిల్ 19న ఈ సినిమా రిలీజవుతోంది. ఈ సినిమా బంపర్ హిట్ అయితే నాని కెరీర్ బెస్ట్ అయ్యే ఛాన్సుంటుంది. అటుపై ఏప్రిల్ 26న హాలీవుడ్ క్రేజీ మూవీ `అవెంజర్స్ – ది ఎండ్ గేమ్` రిలీజవుతోంది. ఈ సినిమా భారతదేశం నుంచి ఏకంగా 300 కోట్లు పైగా కొల్లగొట్టడం ఖాయమన్న అంచనాలేర్పడ్డాయి. రామ్ – పూరి జగన్నాథ్ మూవీ సమ్మర్ రేస్ లో ఉంది. ఇప్పటికే ప్రచారం హోరెత్తుతోంది. అల్లు శిరీష్ నటించిన `ఏబీసీడీ 2` రిలీజ్ బరిలోనే ఉంది. మరి ఈ సీజన్ లో రికార్డులు కొట్టే హీరోగా ఎవరు నిలుస్తారు? ఉన్న వాళ్లలో `మహర్షి` రికార్డుల హీరోగా నిలుస్తాడా? అన్నది చూడాలి.
Please Read Disclaimer