ఫ్యాన్స్ కు షాక్.. మహర్షి మళ్ళీ వాయిదా!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు ముప్పావు భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 25 న విడుదల చేస్తారని ఇప్పటికే ప్రకటించారు.. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5 న ఉగాది సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ షూటింగ్ లో డిలే కారణంగా ఏప్రిల్ 25 కు వాయిదా వేశారు.

కానీ ఇప్పుడు ఏప్రిల్ 25 కు ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు దాదాపుగా లేవట. 25 సంగతి దేవుడెరుగు.. అసలు సమ్మర్ లోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం లేదని ఫిలిం నగర్ టాక్. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండడం.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ సమయం తీసుకునేలా ఉండడంతో జూన్ కు వాయిదా వేయాలని ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పెద్దగా పోటీ లేని సమ్మర్ సీజన్ ను ఇలా మిస్ చేసుకోవడం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసే అంశమే.

మహేష్ బాబు సినిమాలు సహజంగానే లేట్ అవుతుంటాయి. పైగా వంశీ పైడిపల్లి క్వాలిటీ అవుట్ పుట్ పేరుతో సినిమా పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాడు. వీటితో పాటుగా ముగ్గురు నిర్మాతలు ఉండడం కూడా సినిమా డిలేకి కారణం అవుతోందని టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer