మహేష్ నన్ను డ్రగ్స్ తీసుకుంటావాని అడిగాడు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆయనతో వర్క్ ఎక్స్ పీరియన్స్ ను ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మహేష్ పై అభిమానం మరింతగా పెరిగింది. పలువురు మహేష్ గొప్పతనంను… ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ను గురించి మాట్లాడటం జరిగింది. చూడ్డానికి మహేష్ బాబు చాలా సీరియస్ గా హుందాగా కనిపించినా కూడా ఆయన చాలా బాగా పంచ్ లు వేస్తారంటూ పలువురు అన్నారు.

షూటింగ్ గ్యాప్ లో తోటి నటీనటులతో మహేష్ బాబు ప్రవర్తించే తీరు చాలా మందికి ఆదర్శం అవ్వాలంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇటీవల మహేష్ బాబు సెన్సాఫ్ హ్యూమర్ ఆయన మంచితనం గురించి నటుడు రవివర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రవివర్మతో ఒకానొక సమయంలో మహేష్ బాబు చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రవివర్మ ఆ విషయాన్ని బయటకు వెళ్లడించడం తో అంతా మహేష్ బాబు సెన్సాఫ్ హ్యూమర్ గురించి మాట్లాడుకుంటున్నారు.

నటుడు రవివర్మ వెన్నెల సినిమా లో డ్రగ్స్ కు బానిసైన పాత్రలో కనిపించాడు. ఆ సినిమాను చూసిన మహేష్ బాబు ఒక సినిమా షూటింగ్ సమయంలో రవి వర్మతో మాట్లాడుతూ ఐతే నీవు డ్రగ్స్ బాగా తీసుకుంటావన్నమాట అన్నాడట. ఆ మాటలకు అక్కడున్న వారంతా కూడా నవ్వేశారట. ఒక చిన్న నటుడితో కూడా చాలా క్లోజ్ గా కామెడీ చేస్తూ మాట్లాడటం మహేష్ బాబుకే చెల్లుతుందని రవివర్మ అన్నాడు.
Please Read Disclaimer