ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అంటున్న మన ప్రిన్స్

0

సినిమా హీరోల జీవితాలంటే అందరికీ ఒక విధమైన అభిప్రాయం ఉంటుంది. మన హీరోలంతా షూటింగ్ ల పేరుతొ ప్రపంచాన్ని చుట్టేస్తూ – ఎంజాయ్ చేస్తుంటారని – పెళ్ళాం – పిల్లలని పట్టించుకోరనే చాలామంది అనుకుంటారు. ఐతే అలా అనుకునే వాళ్లందరికీ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తన మాటలతోనే కాదు చేతలతోనూ అందరూ అలా ఉండరని చేసి చూపిస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇద్దరు పిల్లలకు ఎప్పుడు సెలవులు వచ్చినా ఆ టైములో తనకి షూటింగ్స్ లేకుండా చూసుకుంటాడు. భార్య – పిల్లలతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు. అక్కడే కొన్ని రోజులపాటు ఎంజాయ్ చేస్తాడు. పిల్లలకు హాలిడేస్ వస్తే షూటింగ్ బంద్ అని ముందే చెప్పి షూటింగ్ కి వెళ్తాడు. సినిమా ఒప్పుకునే ముందే తన పిల్లలకు హాలిడేస్ ఎప్పుడు వస్తాయో ప్లాన్ చేసుకుని డేట్స్ ఇస్తాడు మహేష్. ఇప్పటి జెనరేషన్ లో ఉన్న హీరోలు మహేష్ ని చూసి చాలా నేర్చుకోవాలి.

ఒకప్పటి హీరో శోభన్ బాబు కూడా ఇలానే ఉండేవారని అప్పటి జనరేషన్ వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మన జనరేషన్ లో ఉన్న ఒకే ఒక్క ఫ్యామిలీ మ్యాన్ మన ప్రిన్స్. వయస్సు అయిపోయాక తమ పెళ్ళాం – పిల్లలతో గడపడానికి టైం ఉండేది కాదని – తమ పిల్లలను చిన్నపుడు చాలా మిస్ అయ్యామని చెప్పే కంటే మన మహేష్ ని చూసైనా మిగిలిన హీరోలంతా కెరీర్ ని – ఫ్యామిలీని రెండింటిని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవాలి.
Please Read Disclaimer