మహేష్ మేనల్లుడు.. గ్రాండ్ లాంచ్ ఈవెంట్

0

టాలీవుడ్ లో వారసుల హవా కొన సాగుతూనే ఉంది. తాజాగా మునుపటి తరం సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. ఇప్పటి సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ సినిమా లాంచ్ నిన్న ఘనంగా జరిగింది. ఒక వైపు ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్.. మరోవైపు పొలిటికల్.. బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండడం తో లాంచ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిపారు.

ఈ కార్యక్రమం కోసం స్పెషల్ గా సెట్ వేయడం.. యాంకర్ ను పెట్టడం అందరి దృష్టి ని ఆకర్షించింది. ఏదో లైవ్ అంటే లైవ్ అన్నట్టు కాకుండా భారీ సినిమా కార్యక్రమం తరహా లో జిమ్మీ క్రేన్ లాంటి ఉపయోగించడం గమనార్హం. ఇక అతిథుల లిస్టు కూడా పెద్దదే. రామ్ చరణ్.. రానా దగ్గుబాటి.. నమ్రత.. అమల అక్కినేని.. సుధీర్ బాబు.. నరేష్. తదితరులు సినిమా ఇండస్ట్రీ నుంచి హాజరయ్యారు. గల్లా ఫ్యామిలీ సభ్యులు కాకుండా రామ్మోహన్ నాయుడు.. కేశినేని నాని తదితర రాజకీయ నాయకులు హాజరయ్యారు.

ఈ సినిమాలో గల్లా అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer