వైకుంఠపురం మాట ఎత్తని మహేష్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో పాటు నేడు దర్బార్ విడుదలవ్వగా 12వ తారీకున అల వైకుంటపురంలో మరియు 15వ తారీకున ఎంత మంచివాడవురా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉన్నా కూడా హీరోల మద్య స్నేహపూర్వక వాతావరణం ఉన్నట్లుగానే అనిపిస్తుంది.

అల్లు అర్జున్ తన అల వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ తన సినిమాతో పాటు సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు.. దర్బార్.. ఎంత మంచివాడవురా చిత్రాలు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. సరిలేరు నీకెవ్వరు వేడుక వేదికపై చిరంజీవి కూడా ఆ సినిమాలు సక్సెస్ ను కోరుకున్నాడు. ఇక ఎంత మంచివాడవురా సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు ఆ సినిమాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.

మహేష్ బాబు మాత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న ఇతర చిత్రాల గురించి స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీడియా సమావేశంలో సంక్రాంతికి పోటీగా రాబోతున్న ఇతర సినిమాలపై మీ స్పందన ఏంటీ అంటూ జర్నలిస్ట్ లు ప్రశ్నించగా మహేష్ బాబు మాట్లాడుతూ.. సంక్రాంతి పోటీ లేకుండా గ్యాప్ తో సినిమాలు విడుదల అయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు.

సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగా. ఈ సీజన్ సినిమాలకు చాలా మంచిది. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా తప్పకుండా అన్నింటికి న్యాయం జరుగుతుంది అన్నాడు. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్ని కూడా తప్పకుండా మంచి బిజినెస్ చేస్తాయన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అంతే కాని స్పెషల్ గా సినిమా పేరు అయితే చెప్పలేదు. అల వైకుంఠపురంలో సినిమా పేరును కూడా మహేష్ బాబు ఎందుకు ఎత్తడం లేదు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
Please Read Disclaimer