మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ అదిరిందే!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి తెలిసిందే. సినిమా షూటింగులతో.. ఇతర వ్యాపార వ్యవహారాల తో బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికి తే చాలు కుటుంబం తో గడిపేందుకే ఆసక్తి చూపిస్తారు. సినిమాకు మరో సినిమాకు మధ్య కుటుంబం తో విదేశాలకు విహార యాత్రలకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబు తన కుటుంబం తో అమెరికా ట్రిప్ లో ఉన్నారు.

ఇదిలా ఉంటే మహేష్ కు సంబంధించిన ఓ పాత ఫ్యామిలీ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫోటోలో మహేష్.. ఆయన సతీమణి నమ్రతల తో పాటుగా మహేష్ సోదరి పద్మావతి గల్లా.. జయదేవ్ గల్లా కూడా ఉన్నారు. ఈ ఫోటోలో మహేష్ మేనల్లుడు కూడా ఉన్నాడు. ఈ ఫోటోలో జయదేవ్ గల్లా పంచెకట్టు లో చిరునవ్వులు చిందిస్తూ పోజివ్వడం విశేషం. ఇక మహేష్ ఎప్పటిలాగే బ్లూ షర్టు.. జీన్స్ ధరించి హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ కలెక్షన్స్ సాధించింది. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే నెక్స్ట్ సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదు. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా లో నటిస్తున్నారని.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా లో అతిథి పాత్ర పోషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-