నమ్రతా కాల్ కోసం 2.30 దాకా మేల్కొనే ఉన్న మహేష్

0భరత్ అనే నేను సక్సెస్ కిక్ మామూలుగా లేదు. దాన్ని మహేష్ ఎంతగా ఆస్వాదిస్తున్నాడో మీడియాతో జరిపిన సక్సెస్ మీట్ లో పూర్తిగా షేర్ చేసుకున్నాడు. సినిమా ప్రీమియర్స్ తొలుత అమెరికాలో జరుగుతున్నప్పుడు నిద్ర పట్టలేదని చెప్పిన మహేష్ ఫస్ట్ షో 2.30కు పూర్తవ్వగానే మొదటి కాల్ శ్రీమతి నమ్రతా నుంచే వచ్చిందట. సినిమా సూపర్ హిట్ అని టాక్ చాలా బాగుందని రికార్డ్స్ నెలకొల్పుతుందని అందరు మాట్లాడుకుంటున్నారని చెప్పాక మనసు కుదుటపడిందట. తన కూతురు సితార కూడా ఇందులో పాటలను విపరీతంగా ఇష్టపడిందని ముఖ్యంగా వసుమతి అనే సాంగ్ కు ఫ్యాన్ గా మారిపోయిందిని చెబుతున్నప్పుడు మహేష్ కళ్ళలో ఆనందం మామూలుగా లేదు. కొరటాల శివకు రామజోగయ్య శాస్త్రి పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మహేష్ రెండేళ్ళ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ కాబట్టి రిలీఫ్ గా కనిపించాడు.

మహేష్ నమ్రతా గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయటం ఇదే మొదటి సారి కాదు. విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా రెండేళ్ళు సక్సెస్ లేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు అభిమానులు కోరుకున్న సినిమాను ఇవ్వాలన్న తపన తన కంటే ఎక్కువ నమ్రతాలోనే చూసానన్న మహేష్ తనతో సమానంగా కష్టపడినందువల్లే ఈ రోజు ఇంత సక్సెస్ చూడగలుగుతున్నామని చెప్పుకొచ్చాడు. మొత్తానికి మహేష్ కోసమే నమ్రతా ప్రీమియర్ షో చూడడానికి అమెరికా వెళ్ళిందా లేక ప్రీమియర్ సమయానికి అనుకోకుండా అక్కడ ఉండాల్సి వచ్చిందా అనేది మహేష్ జంటకే తెలుసు. ఇంకా ఫస్ట్ వీక్ కంప్లీట్ కాకుండానే ఇన్ని రికార్డులు కొల్లగొడుతున్న భరత్ అనే నేను ఈ వీక్ ఎండ్ పూర్తయ్యాక కొత్త రికార్డులు సెట్ చేసేలా ఉంది.