రిలీజ్ ముందు టెన్షన్ పై మహేష్ మాట

0

టాలీవుడ్ లో వున్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ ఫాలోయింగ్ వేరు. పాన్ ఇండియా స్థాయి చిత్రాలు చేయకపోయినా మహేష్ కి ఉన్న క్రేజ్ అసాధారణం. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మహేష్ చిత్రాలకు మంచి డిమాండ్ వుంది. తను నటించిన పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉత్తరాదిలో రీమేక్ అయ్యి సూపర్ హిట్లుగా నిలిచాయి. సల్మాన్ లాంటి స్టార్ కెరీర్ కి పోకిరి రీమేక్ పెద్ద సాయమైంది. ఇంత ట్రాక్ రికార్డ్ వున్న మహేష్ కూడా తన సినిమా రిలీజ్ అవుతోందంటే భయంతో వణికిపోతాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు.

ఎన్ని సంవత్సరాలు పనిచేసినా. ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి వున్నా ఒక సినిమా విడుదలవుతోందటే వుండే టెన్షన్ మామూలుగా వుండదు. అలా కాకుండా మాకు ఎలాంటి టెన్షన్ లేదని ఎవరు చెప్పినా ఆ మాటలు అబద్ధాలే. ఆ మాటల్ని ఎవరూ నమ్మవద్దు. ఎందుకంటే సినిమాపై మాకు ఉండే గౌరవం భయం భక్తి అలాంటివి` అని మహేష్ చెబుతున్నారు. ఒక సినిమా తెరపైకి రావాలంటే చాలా మంది సమిష్టి కృషి వుంటుంది. ఎన్నో అనుభవాలు వుంటాయి. ప్రతీ ఒక్కరు ప్రాణం పెట్టి ఓ మంచి చిత్రం కోసం పనిచేస్తారు. అలా పనిచేసిన సినిమా విడుదలవుతున్న వేళ ఒక్కొక్కరిలో ఏర్పడే భావోద్వేగాల్ని.. ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఎదురుచూసే క్షణాల్ని..ఆ అనుభూతుల్ని మాటల్లో వర్ణించలేను` అని తన అనుభూతుల్ని పంచుకున్నారు.

మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు` శరవేగంగా చిత్రీకరణ పూర్తవుతోంది. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.
Please Read Disclaimer