బయ్యర్ల గురించి అలోచిస్తాడా.. మహేష్ కూడా మొండిగా వెళ్తాడా?

0

సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు కళ్ళు మూసి తెరిచేలోపు మారిపోతున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11 న రిలీజ్ అవుతుందని.. ‘అల వైకుంఠపురములో’ జనవరి 12 న విడుదల కానుందని అందరికీ తెలిసిందే. అయితే ‘అల వైకుంఠపురములో’ టీమ్ తమ సినిమాను ప్రీపోన్ చేసి జనవరి 10 వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఈ రిలీజ్ డేట్ అంశం ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

‘సరిలేరు నీకెవ్వరు’.. ‘అల వైకుంఠపురములో’ మధ్య రిలీజ్ డేట్ విషయంలో మొదటి నుంచి పోటీ నెలకొని ఉంది. ఒకే తేదీన విడుదల చేస్తామని ప్రకటించడం.. ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుకోవడంతో మహేష్ సినిమాను ఒక రోజుముందుగా జనవరి 11 కు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ టీమ్ ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి కొత్త డేట్ ను ప్రకటించడం మహేష్ కు కోపం తెప్పించిందని తమ సినిమాను కూడా జనవరి 10 నే రిలీజ్ చేయాలని చెప్పారని అంటున్నారు. అయితే నిజంగా ఈ సినిమాను 10 వ తారీఖున విడుదల చేయడం సాహసం అనే చెప్పాలి.

‘సరిలేరు నీకెవ్వరు’ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. ఈమధ్య ఇంటర్వ్యూలో కూడా నిర్మాత అనిల్ సుంకర తమ సినిమా బడ్జెట్ ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ అయిందని కూడా చెప్పారు. అల్లు అర్జున్ సినిమా కంటే మహేష్ సినిమా బడ్జెట్ ఎక్కువని అంటున్నారు. ఒకే రోజు పోటీలో రిలీజ్ అయితే ఏ సినిమాకూ ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం లేదు. దీని వల్ల మహేష్ సినిమాకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. సినిమాకు లాంగ్ రన్ ఎలా ఉంది అన్నది టాక్ పైన రివ్యూస్ పైన ఆధారపడి ఉటుంది. కానీ ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం వీటితో సంబంధం ఉండదు ఎందుకంటే ఎడ్వాన్స్ బుకింగ్స్ ముందే అయిపోతాయి కాబట్టి అవే సినిమాకు ముఖ్యం. ఈ విషయంలో ‘సరిలేరు నీకెవ్వరు ‘టీమ్ కు నష్టం అని అంటున్నారు.

ఇది ఒక సమస్య అయితే.. ఇప్పటికే థియేటర్ల అగ్రిమెంట్స్ పూర్తయ్యాయని.. అవన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా అగ్రిమెంట్స్ చేయాలనేది మరో సమస్య. ఇక ఓవర్సీస్ లో ఎడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు క్యానిల్ చేసి కొత్త డేట్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా సమస్యలే. ఇది మహేష్ సినిమాకే కాదు. బన్నీ సినిమాకు కూడా ఉంటాయి. మరి ఈ అంశాలు ఆలోచించి కూడా మహేష్ మైండ్ లో ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా వెళ్లిపోతాడా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం.. ఉరుము ఉరిమి మంగళం మీద పడింది అన్నట్టుగా బన్నీ – మహేష్ మధ్య పోటీ బయ్యర్ల.. డిస్ట్రిబ్యూటర్ల చావుకొచ్చిందని కొందరు సూటిగా సుత్తిలేకుండా కామెంట్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.
Please Read Disclaimer