మహేష్ ఎవ్వరిని వదలట్లేదుగా..!

0

మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. మహేష్ 26వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు రాబోతుంది. ఇదే సమయంలో మహేష్ 27వ చిత్రానికి సంబంధించిన ప్రచారం మొదలైంది. మొన్నటి వరకు సరిలేరు నీకెవ్వరు చిత్రం పూర్తి అయిన వెంటనే ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మహర్షి చిత్రం విడుదల కాకముందే మహేష్ బాబుకు వంశీ ఒక లైన్ చేప్పాడని.. ఆ లైన్ బాగా నచ్చడంతో వంశీతో మహేష్ మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడనే వార్తలు సినీ వర్గాల్లో ప్రచారం జరిగాయి. దిల్ రాజు ఆ సినిమాను నిర్మించబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ రెడీ చేసేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని.. ఆలోపు మహేష్ బాబు మరో సినిమాను చేసే అవకాశాలున్నాయంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

కేజీఎఫ్ చిత్రంతో కన్నడంలోనే కాకుండా యావత్ ఇండియాలో కూడా గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నిల్. ఈయన ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రాన్ని చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమాను పూర్తి చేసి మహేష్ బాబుతో సినిమాను మొదలు పెడతాడట. ఇటీవలే వీరిద్దరి భేటీ కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. వంశీతో కాస్త ఆలస్యంగా అయినా సినిమా చేయవచ్చు.. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ప్రశాంత్ నిల్ తో సినిమా చేస్తే బాగుంటుందని మహేష్ బాబు భావిస్తున్నాడట.

అందుకే వచ్చే ఏడాది సమ్మర్ వరకు మహేష్ బాబు.. ప్రశాంత్ నిల్ ల కాంబో మూవీ పట్టాలెక్కించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి చిన్న విషయం కూడా అఫిషియల్ గా బయటకు రాలేదు. సక్సెస్ వచ్చిన ఏ దర్శకుడిని కూడా మహేష్ వదలకుండా వారితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer