మరో తమిళ మూవీపై మహేష్ ప్రశంసలు

0

ఈమద్య కాలంలో మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెల్సిందే. ఆయన తన పిల్లలు.. ఫ్యామిలీతో సరదాగా గడిపిన మూమెంట్స్ తో పాటు ఇతర హీరోల సినిమాలపై కూడా స్పందిస్తూ తన అభిప్రాయంను తెలియజేస్తున్నాడు. మహేష్ బాబు ఎక్కువగా తమిళ సినిమాల గురించి స్పందిస్తూ ఉన్నాడు. ఇటీవల తమిళంలో విడుదలైన ‘అసురన్’ చిత్రంపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు.

ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ కీలక పాత్రలో కనిపించారు. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్.. విజయ్ సేతుపతి నటించారు. వెట్రి మారన్ దర్శకత్వంలో ది వి క్రియేషన్స్ బ్యానర్ లో అసురన్ తెరకెక్కింది. అక్టోబర్ 4న విడుదలైన అసురన్ కాస్త ఆలస్యంగా మహేష్ బాబు చూశాడు. నిన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. దాంతో నిన్న అసురన్ చిత్రాన్ని మహేష్ చూసినట్లుగా తెలుస్తోంది.

సినిమా చాలా సహజంగా ఉందని.. సినిమాలోని ప్రతి అంశాన్ని చాలా డెప్త్ గా చూపించే ప్రయత్నం చేశారంటూ ప్రశంసించాడు. సినిమా చాలా నచ్చిందని యూనిట్ సభ్యులందరికి శుభాకాంక్షలు తెలియజేశాడు. 100 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిన అసురన్ చిత్రం ధనుష్ కెరీర్ లో నిలిచి పోయే సినిమా అంటూ తమిళ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer