ఇలయదళపతితో మహేష్ మల్టీస్టారర్

0

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలయదళపతి విజయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంతటోడు. పవన్ ని మించి సక్సెస్ రేటు ఉన్న స్టార్ హీరో. టాలీవుడ్ లో మహేష్ …కోలీవుడ్ లో విజయ్ ఆ రేంజు హీరోలు. సినిమాల పరంగా ఈ స్టార్ హీరోల ఇద్దరిపైనా వంద కోట్లు పైగా వ్యాపారం జరుగుతోంది. ఆ ఇద్దరూ ఇరుగు పొరుగు మార్కెట్లలోకి దూసుకెళ్లాలన్న పంతంతోనూ ఉన్నారు. ఇక కోలీవుడ్ మార్కెట్ పై పట్టు సాధించాలని మహేష్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. స్పైడర్ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని మురుగదాస్ తో కలిసి ప్లాన్ చేసాడు కానీ అనూహ్యంగా అంచనాలను అందుకోలేకపోయాడు. మహేష్ విషయంలో మురుగదాస్ ఎంతో రెస్పా బిలిటీ తీసుకున్నా కొన్ని తప్పిదాల వల్ల వర్కవుట్ అవ్వలేదు.

ఏ రోజైనా కోలీవుడ్ లో మహేష్ ఛాన్స్ తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇక విజయ్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ మార్కెట్ పైనా పట్టు సాధించే పనిలో ఉన్నాడు. తెలుగు ఆడియెన్ ని కంటెంట్ తో కొట్టాలని చూస్తున్నాడు. మెర్సల్- సర్కార్- బిగిల్ ఆ తరహా ప్రయత్నాలే. సూర్య- కార్తీలా వెంటనే కుదరకపోయినా తెలుగు ఆడియన్స్ కు నెమ్మదిగా కనెక్ట్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్- విజయ్ మల్టీస్టారర్ కి సన్నాహాలు చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన అభిమానుల్లో ట్రెండింగ్ అవుతోంది. దీనిపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మహేష్ కి ఎదురైంది. దానికి సమాధానంగా సూపర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

విజయ్ తో కలిసి మల్టీస్టారర్ చేయడానికి మీరు సిద్దంగా ఉన్నారా? అని తమిళ మీడియా ఇంటర్వూలో ప్రశ్నించగా తాను సిద్ధమేనని అన్నారు. ఇద్దరి ఇమేజ్ లకు తగ్గ స్క్రిప్ట్.. దాంతో పాటే సరైన దర్శకుడు కుదిరినప్పుడు రెండు భాషల్లో సినిమా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇక మహేష్ నటించిన ఒక్కడు- పోకిరి గతంలో విజయ్ తమిళ్ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer