మహేష్ రెమ్యూనరేషన్ అలా తగ్గిపోయింది!

0

మన టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన ఈమధ్య చేసిన మూడు సినిమాలకు గానూ తన రెమ్యూనరేషన్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ అందుకున్నారని ఇన్ సైడ్ టాక్. ఈ మూడు సినిమాలకు గాను రెమ్యూనరేషన్ మొత్తం రూ.150 కోట్లు. ఈ మేరకు మహేష్ చెక్ కూడా అందుకున్నారట. అయితే మొదటి సినిమాకు పారితోషికం బాగానే వర్క్ అవుట్ అయినప్పటికీ ‘మహర్షి’.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల విషయంలో లోటు ఏర్పడిందని సమాచారం.

ఈ రెండు సినిమాలకు రూ. 25 కోట్లు తగ్గిందట. ‘మహర్షి’ నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 35 కోట్లకు క్లోజ్ కావడంతో అక్కడ 15 కోట్ల రూపాయలు మహేష్ రెమ్యూనరేషన్ తక్కువ వచ్చిందని అంటున్నారు. దీంతో ఆ 15 కోట్లు వెనక్కు ఇవ్వాల్సి వచ్చిందట. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ రూ. 40 కోట్లకు క్లోజ్ అయిందట. దీంతో ‘సరిలేరు నీకేవ్వరు’ రెమ్యూనరేషన్ పది కోట్లు తగ్గిందని అంటున్నారు. అందుకే ఈ పది కోట్లు వెనక్కు ఇవ్వాల్సిన పరిస్థితి.

ఈలెక్కన మూడు సినిమాలకు మహేష్ రెమ్యూనరేషన్ ముందుగా అనుకున్న దానికంటే రూ. 25 కోట్లు తగ్గిందని టాక్. శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్.. హిందీ డబ్బింగ్ రైట్స్ కు గతంలో భారీ డిమాండ్ ఉండేది. ఎగబడి మరీ కొనేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ తగ్గడంతోనే మహేష్ రెమ్యూనరేషన్ తగ్గిందని అంటున్నారు. మరి భవిష్యత్తులో కూడా మహేష్ ఇదే రెమ్యూనరేషన్ పాలసీని కొనసాగిస్తారో లేదా మారుస్తారో వేచి చూడాలి.
Please Read Disclaimer