ప్రియాంకరెడ్డి హత్య: మహేష్ బాబు ధర్మాగ్రహం

0

ప్రియాంకరెడ్డి హత్యపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ దారుణ అత్యాచారం హత్యపై దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రియాంకరెడ్డికి మద్దతుగా ప్రజలు రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా తాజాగా ఈ దారుణంపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించారు.

రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్న పరిస్థితుల్లో మార్పు రావడం లేదని మహేష్ బాబు ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను మార్చడంలో ఒక సమాజంగా మనం ఫెయిల్ అయ్యామని వాపోయారు.

ఇక ప్రియాంకరెడ్డిని హతమార్చిన క్రిమినల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని.. చట్టాలను మరింత కఠినం చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ కేటీఆర్ లను ట్యాగ్ చేస్తూ మహేష్ బాబు కోరారు. చట్టాలు కఠినం చేస్తేనే సత్వరం న్యాయం జరుగుతుందని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
Please Read Disclaimer