ఆన్ లొకేషన్ స్టిల్: పక్కా మాస్ మహేష్.. రష్మిక

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మహేష్ ఈమధ్య తన సినిమాల్లో పెద్దగా డ్యాన్సులు వేసి అభిమానులను మురిపించింది లేదు. అయితే ఈ సినిమాలో మాత్రం మహేష్ తన డ్యాన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. అభిమానులకు.. ప్రేక్షకులకు మహేష్ డ్యాన్సులు ఒక ట్రీట్ లాగా ఉండబోతున్నాయని సమాచారం.

దీనికి శాంపిల్ అన్నట్టు గా ఈమధ్య ‘డాంగ్ డాంగ్’ పాటలో తమన్నా తో మహేష్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. ఈ పాట మాత్రమే కాదు… ఈ సినిమా లో మరో పాట ‘మైండ్ బ్లాక్’ లో కూడా మహేష్ స్టెప్పులు సూపర్ గా ఉన్నాయట. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటకు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మహేష్ గళ్ల లుంగీ.. పూల చొక్కా ధరించి నిలుచుని ఉన్నాడు. పక్కనే రష్మిక ఫోక్ స్టైల్ డ్రెస్ లో ఉంది. శేఖర్ మాస్టర్ రష్మికకు ఏదో సూచనలు అందిస్తున్నారు. మహేష్ కూడా వారిద్దరి సంభాషణను ఆసక్తితో వింటున్నారు. ఈ పాటలో మహేష్.. రష్మికల గెటప్స్ ఊరమాసు స్టైల్ లో ఉంది.

ఈ పాటకోసం భారీ ఖర్చు తో ఒక పెద్ద సెట్ ను నిర్మించారు. ఈ పాటకు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మాస్ ప్రేక్షకులను మెప్పించే ఒక ట్యూన్ అందించిన సంగతి తెలిసిందే. మరి ఈ మైండ్ బ్లాక్ చిత్రీకరణ ఎలా ఉందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడకతప్పదు.
Please Read Disclaimer