సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

మళ్లీ 50 డేస్ అంటూ స్టార్ట్ చేస్తున్నారు!

0

కొన్నాళ్లుగా చడీ చప్పుడు లేకుండా ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నారనే భావించారు. కానీ ఇంతలోనే 50 డేస్ సెలబ్రేషన్ అంటూ మళ్లీ మొదలెట్టేశారు. మరోసారి ఇరువురు అగ్ర హీరోలు నువ్వా నేనా? అంటూ యాభై రోజుల పార్టీలతో హీటెక్కించేయడం ఖాయంగానే కనిపిస్తోంది. తాజా సన్నివేశం చూస్తుంటే సంక్రాంతి పుంజులు రీబూటెడ్ అనే భావించాల్సి ఉంటుంది.

ఆల్రెడీ మహేష్ `సరిలేరు..` టీమ్ ఆర్భాటం మొదలైపోయింది. ఈ సినిమా 50 రోజుల వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. త్వరలోనే అనీల్ రావిపూడి- దిల్ రాజు బృందం ఆ తేదీని చెప్పేస్తారట. ఈ వేడుకకు మహేష్ అభిమానులు సహా పంపిణీదారులు – ఎగ్జిబిటర్లు ఎటెండ్ కానున్నారని తెలుస్తోంది. అయితే ఇదంతా చూస్తుంటే మొన్ననే బన్ని అల వైకుంఠపురములో సక్సెస్ పార్టీని ఎలా ప్లాన్ చేశారో సేమ్ టు సేమ్ దించేస్తున్నారా? అన్న సందేహం కలగక మానదు. ఆ పార్టీలో బన్ని ప్రత్యేకించి పంపిణీదారుల్ని కూడా ఆహ్వానించారన్న టాక్ ఉంది. ఇప్పటికే అల పంపిణీదారులు .. ఎగ్జిబిటర్లు పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదంతా గమనిస్తున్న సరిలేరు చిత్రబృందానికి మింగుడుపడలేదని ఇంతకుముందు ప్రచారమైంది. అందుకే దానికి పోటీగానే ఇప్పుడిలా 50రోజుల వేడుక పేరుతో పార్టీకి ప్లాన్ చేశారన్నమాట వినిపిస్తోంది. మహేష్ ఇప్పటికే అమెరికా టూర్ ముగించి హైదరాబాద్ లో అడుగు పెట్టేయడంతో పార్టీల స్పీడ్ కూడా పెరిగినట్టే కనిపిస్తోంది. రిలీజ్ ముందు పోస్టర్ల వార్ .. రిలీజ్ సమయంలో థియేటర్లకు సంబంధించిన వార్.. ఆ తర్వాత రికార్డులకు సంబంధించిన ప్రచార యుద్ధం.. ఇదంతా చూశాం. ఇప్పుడు 50రోజుల వేడుకల పేరుతో మహేష్ – బన్ని టీమ్ లు పోటీపడనున్నాయని అర్థమవుతోంది. సరిలేరు నీకెవ్వరు జనవరి 11న రిలీజైతే… అల వైకుంఠపురములో జనవరి 12న రిలీజైంది. ఒకరోజు మాత్రమే తేడా కాబట్టి వెంట వెంటనే 50 రోజుల వేడుకలతో హీటెక్కించేస్తారన్నమాట.
Please Read Disclaimer