‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్

0

‘‘చిన్న బ్రేక్ ఇస్తు్న్నాను.. తరవాత బొమ్మ దద్దరిళ్లిపోద్ది’’.. కర్నూలులోని కొండారెడ్డి బుర్జు ముందు నిలబడి మహేష్ బాబు ఫుల్ ఎనర్జీతో చెప్పే ఈ డైలాగ్ ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ ఆఖరిలో వచ్చింది. డైలాగులో ఉన్నట్టు నిజంగానే దద్దరిళ్లిపోయేట్టే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం రాత్రి 9.09 గంటలకు విడుదల చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ మెగా సూపర్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాలో చూడని కామెడీ సీక్వెన్స్ ఈ చిత్రంలో ఉండబోతోంది. ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ సీక్వెన్స్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘దూకుడు’ తరవాత మరోసారి మహేష్ బాబు కడుపుబ్బా నవ్వించబోతున్నారు. ఇక యాక్షన్‌కు కూడా ఈ సినిమాలో కొదవలేదు. ముఖ్యంగా సినిమాలో డైలాగులు ఎలా ఉండబోతున్నాయో, ప్రేక్షకులను ఎంతలా అలరించబోతున్నాయో ట్రైలర్‌లో చూపించారు.

‘‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’’ అనే కామెడీ డైలాగుతో పాటు ‘‘రేయ్.. కాలేజ్ స్టూడెంట్ అనకుంటున్నావా? స్టేట్ మినిస్టర్‌వి. లేడీస్‌తో ఏం మాట్లాడుతున్నావ్’’ అంటూ మహేష్ చెప్పే డైలాగులు చాలానే ఉన్నాయి. ప్రతి డైలాగ్ థియేటర్‌లో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే సంక్రాంతికి బొమ్మ దద్దరిళ్లిపోద్ది.
Please Read Disclaimer