రికార్డ్స్ కోసం స్టార్ హీరోలందరూ మహేష్ ని ఫాలో అవుతారా…?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డ్ చేరిపోయింది. నిజానికి మహేష్ కి రికార్డులు కొత్తకానప్పటికీ ఇది మాత్రం అరుదైన రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్ లో ఇప్పుడు మహేష్ నెంబర్ వన్ స్టార్ హీరోగా నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఉండే హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా విషయాలతో పాటు ఫ్యామిలీ పర్సనల్ విషయాలు మరియు సామాజిక అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తూ ప్రజలకు చేరువలో ఉంటారు మహేష్. అలాగే ఇటీవల కరోనా సమయంలో ప్రజలకు జాగ్రత్తలు చెప్పడంతో పాటు ఏదో ఒకదానిపై స్పందిస్తూ మహేష్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సినీ అభిమానులే కాకుండా సాధారణ నెటిజన్స్ కూడా ఫాలోవర్స్ గా మారిపోయారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లు దాటింది. అంటే మహేష్ కోటి కి పైగా ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడన్నమాట. దీంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో కోటి మంది ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన వ్యక్తిగా మహేష్ నిలిచారు.

ఇదిలా ఉండగా మహేష్ ఈ అరుదైన ఫీట్ సాధించిన సందర్భంగా తన ఫాలోవర్స్ కి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేసాడు. ”10 మిలియన్ థ్యాంక్స్ అనేవి నాకున్న అపారమైన కృతజ్ఞతను ఎప్పటికీ సంకలనం చేయలేవు! నిజంగా మీ అందరితో కనెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది.. మచ్ లవ్ #10MillionStrong” అని ట్వీట్ చేశారు. ట్విట్టర్ లో మహేష్ 10 మిలియన్స్ మార్క్ చేరుకోవడంతో అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసారు. కాగా మహేష్ కి ఉన్న కోటి మంది అనుచరులలో 70 లక్షలు మంది మన తెలుగు వారు ఉండే అవకాశం ఉంది. మహేష్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో మిగతా వారు ఇతర ఇండస్ట్రీలవారు అయ్యుండొచ్చు. అయితే ఈ ట్విట్టర్ ఫాలోవర్స్ లో సగం మంది మహేష్ సినిమాను చూసినా దాని రెవెన్యూ ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంది.

ఇక మహేష్ ఈ మధ్య తన పర్సనల్ ఫోటోలు తెగ షేర్ చేయడానికి కారణం ట్విట్టర్ లో ఈ మైల్ స్టోన్ అందుకోవడం కోసమేనా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ 10 మిలియన్ అనుచరులను తెచ్చుకోవడంతో ఇప్పుడు సూపర్ స్టార్ ని చూసి మిగతా హీరోలు కూడా ట్విట్టర్ ఫాలోవర్స్ పెంచుకోడానికి ట్రై చేస్తారేమో. ముఖ్యంగా మహేష్ తో పోటీ పడే స్టార్ హీరోలు ఆ ఫీట్ ని అందుకోవడమే లక్ష్యంగా ట్విటర్ లో యాక్టీవ్ గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ట్విట్టర్ ఫాలోవర్స్ పరంగా మహేష్ తర్వాత కమల్ హాసన్ 6.1 మిలియన్ల.. అక్కినేని నాగార్జున మరియు దగ్గుబాటి రానా 6 మిలియన్స్.. రజనీకాంత్ 5.7 మిలియన్లు.. అల్లు అర్జున్ 4.7 మిలియన్లు.. జూనియర్ ఎన్టీఆర్ 4.2 మిలియన్స్.. విజయ్ 2.5 మిలియన్ ఫాలోవర్స్ తో కొనసాగుతున్నారు. మరి వీరిలో మహేష్ రికార్డ్ ని ఏ స్టార్ హీరో అందుకుంటాడో చూడాలి.