పరశురామ్ కు దీపావళి గిఫ్ట్ పంపిన మహేశ్

0

మహేశ్ బాబు ఎంత ప్రొఫెషనల్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తన మన తాను చేసుకుంటూ ఎప్పుడు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడు. దర్శక నిర్మాతలకు ఎంతో గౌరవం ఇస్తుంటాడు. కేవలం దర్శకుడు చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటాడు. అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా నిలిచిపోయాడు. మహేష్ బాబు దర్శకుల హీరో అని చెబుతుంటారు. తన దర్శకులను ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తుంటాడు. తాజాగా మహేష్ బాబు తన దర్శకుడు పరుశురామ్కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ బహుమతులు చూసి పరశురామ్ ఎంతో ఎమెషనల్ అయ్యాడు.

మహర్షి సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన మహేశ్.. చాలా కథలు విని చివరకు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసుకున్నది. ఆ సినిమా షూటింగ్ కేవలం ఆరునెలల్లోనే పూర్తయ్యింది. ఈ తర్వాత మళ్లీ ఎన్నో కథలు విని.. చివరకు పరశురామ్ వినిపించిన ‘సర్కారు వారి పాట’ చిత్రానికి కనెక్ట్ అయ్యాడు. కరోనాతో ఆ సినిమా షూటిం ఆలస్యంగా నడుస్తున్నది. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ నవంబర్ చివర్లో గానీ డిసెంబర్ మొదటి వారంలో గానీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ చాలాగ్యాప్ తర్వాత యూఎస్ వెళ్లాడు. తాజాగా ప్రేక్షకులకు అభిమానులు దీపావళి విషెస్ తెలిపాడు. కాలుష్యానికి దూరంగా ఉండండని కోరాడు. అయితే మహేష్ బాబు తన దర్శకుడు పరుశురామ్కు దీపావళి సందర్భంగా బహుమతులను పంపాడు. వాటిని పరుశురామ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గాల్లో తేలిపోయాడు. తనకు ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇలాంటి గిఫ్ట్స్ పంపలేదని పేర్కొన్నాడు పరుశురామ్.