కూతురు కోసం ఆటలో ఓడిపోయిన సూపర్ స్టార్

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదేమైనా తన ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అంటాడు. ఎప్పుడు షూటింగులతో బిజీగా ఉండే మహేష్.. ఖాళీ దొరికిందంటే మాత్రం గౌతమ్ సితారలకు సమయం ఫుల్లుగా కేటాయించేస్తాడు. వాళ్ళతోనే సరదాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాడు. అయితే కరోనా కారణంగా దాదాపు మూడు నెలలపాటు ఇంటి పట్టునే ఉంటున్న మహేష్.. ఫ్యామిలీతో డైలీ సరదాగా గడిపేస్తున్నాడు.అయితే గౌతమ్.. సితారలతో మహేష్ రోజురోజుకి అల్లరి బాగానే చేస్తున్నాడట. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలను ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక మహేష్ కూడా అప్పుడప్పుడు తన పిల్లలతో సరదాగా గడిపిన వీడియోలను ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాడు. తాజాగా కూతురు సితారతో పోటీపడి ఆడిన ఓ గేమ్ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తోంది.

మహేష్.. సితార ఇద్దరు కలిసి టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడారు. ఈ గేమ్ లో పదాలను కరెక్ట్‌గా వేగంగా గట్టిగా బయటికి చెప్పాలి. అయితే.. ఈ గేమ్‌లో తానే గెలిచానని తండ్రితో సితార వాదించడం మనం చూడొచ్చు. మొత్తానికి అటు ఇటు వాదించి గెలిచినట్టు మహేష్‌ను ఒప్పించేసింది. ఈ తండ్రి కూతురు మధ్య సరదాగా జరిగిన ఈ వాదన వీడియోలో కనిపిస్తుంది. కూతురిని గెలిపించడం కోసం మహేష్ ఈ గేమ్‌లో ఓడిపోయాడని నెట్టింట అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేయనున్నాడు. విడుదలైన టైటిల్.. ఫస్ట్ లుక్ పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ ప్లస్ జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఇటీవలే మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా ఎంపికైంది.

 

View this post on Instagram

 

Time for a tongue twister !! She’s convinced she’s got it right ♥️♥️♥️ @sitaraghattamaneni #staysafe #homebound #familytime

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on
Please Read Disclaimer