మహిళా శక్తికి సూపర్ స్టార్ ఇచ్చే గౌరవం

0

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో స్టార్ల స్పందనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఇలాంటి విషయాల్లో ఎంతో అడ్వాన్స్ డ్ గా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలోకి భార్య నమ్రతా శిరోద్కర్.. తన తల్లి గారు ఇందిరా దేవి.. అలాగే కుమార్తె సితార కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోని అభిమానులకు షేర్ చేశారు. ఆ ఛాయాచిత్రంతో పాటు.. మహేష్ ఒక శక్తివంతమైన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు.. మహిళలందరికీ తన తరపున శుభాకాంక్షలు చెబుతూ మహేష్ ఓ వ్యాఖ్యను రాశాడు. “ఈ ముగ్గురు .. నాతో ఉన్న ఈ మహిళలందరి శక్తి అనిర్వచనీయం. హ్యాపీ # ఉమెన్స్ డే # ఇంటర్నేషనల్ వుమెన్స్ డే“ అంటూ వ్యాఖ్యను జోడించారు.

నమ్రతా శిరోద్కర్ సైతం ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ.. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఫోటోని షేర్ చేశారు. “ఆమె నా మార్గదర్శకురాలు.. నా ఉనికిలో ఉండే నా ఆత్మ .. ప్రతిరోజూ ఆమె శక్తి నాతో ఉందని తెలిసి ముందుకు సాగుతున్నా. తన ఆశీర్వాదం ఆమెలాగే బలంగా ఉండటానికి నాలో నిరంతరం ప్రేరణను కలిగిస్తుంది. ఆమె లైఫ్ టైమ్ నా మనిషి!! నేను .. ఆమె # హ్యాపీ ఉమెన్స్.. హ్యాపీ ఉమెన్స్ డే“ అని విషెస్ తెలిపారు. మహేష్ తల్లిగారైన ఇందిరా దేవి ఫోటోని నమ్రత షేర్ చేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ నుంచి మొదటి లిరికల్ సాంగ్ `మాగువా మాగువా..` నేడు రిలీజైన సంగత తెలిసిందే. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా… ధైర్యవంతులైన మహిళలందరికీ ఈ పాట సరైన నివాళి అన్న ప్రశంసలు దక్కాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-