వైరల్ పిక్స్: డెన్వర్ షూట్ లో మహేష్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటుగా బ్రాండ్ ఎండార్స్ మెంట్ల విషయంలో కూడా జోరు చూపిస్తారనే విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కార్పోరేట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబు రీసెంట్ గా మెన్స్ గ్రూమింగ్ ప్రాడక్ట్స్ బ్రాండ్ ‘డెన్వర్’ కు ప్రచారం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

రీసెంట్ గా డెన్వర్ బ్రాండ్ డియోడరెంట్ అడ్వర్టైజ్మెంట్ షూట్ జరిగింది. మహేష్ తో పాటుగా ఈ యాడ్ లో ఒక ఫిమేల్ మోడల్ కూడా నటించింది. ఈ యాడ్ షూట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ షూట్ లో మహేష్ బాబు వైట్ షర్ట్ .. బ్లాక్ ప్యాంట్ ధరించి మెడలో టైతో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఫోటోలలో మహేష్ స్టైలిష్ గానే కాకుండా మోడల్ తో రొమాంటిక్ గా కూడా పోజులిచ్చారు.

సినిమాల విషయానికి మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ కాగా.. విజయశాంతి.. ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అనిల్ సుంకర.. దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer