సన్నాఫ్ మహేష్ బాబు.. ఫ్రెండ్ తో

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాదు అయన పర్సనల్ లైఫ్ పట్ల కూడా ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. మహేష్ కూడా అప్పుడప్పుడూ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన పిల్లలకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే మహేష్ కంటే ఎక్కువగా ఆయన సతీమణి నమ్రత పిల్లలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ను షేర్ చేస్తూ అభిమానులను సంతోషపెడుతుంటారు.

తాజాగా నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు “మా MUN ప్రతినిథులు.. గౌతమ్ తన బెస్ట్ ఫ్రెండ్ శ్రేయశస్ రెడ్డి తో స్కూల్ లో సండే డిబేట్ కోసం” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. MUN అంటే ఏంటో తెలుసా? మోడల్ యునైటెడ్ నేషన్స్. అంటే ఐక్య రాజ్యసమితి మోడల్ లో చర్చలు నిర్వహిస్తారన్న మాట. ఈ ఫోటోలో గౌతమ్ తన స్నేహితుడితో కలిసి ఇంటి ముందు నిలుచుని ఫోటోకు పోజిచ్చాడు. ప్యాంట్ జేబులలో చేతులు పెట్టుకొని స్టైల్ విషయం లో నాన్న మహేష్ బాబును గుర్తు తెస్తున్నాడు.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గౌతమ్ అచ్చంగా మహేష్ స్టైల్ లో ఉన్నాడని చాలామంది పొగడ్తలు కురిపించారు. మహేష్ పిల్లలలో సితార పాప అల్లరికి పర్మనెంట్ బ్రాండ్ అంబాజిడర్ లా ఉంటే.. గౌతమ్ మాత్రం హంబుల్ నెస్ కు బ్రాండ్ అంబాజిడర్ అనిపిస్తాడు. మహేష్ క్లోతింగ్ బ్రాండ్ కు గౌతమ్ పర్ఫెక్ట్ మోడల్ గా సెట్ అయ్యేలా ఉన్నాడు.
Please Read Disclaimer