ముంబై ఎయిర్ పోర్ట్ లో సూపర్ స్టార్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తన బెంచ్ మార్క్ 25వ చిత్రంగా మహర్షిని చేసి సూపర్ హిట్ దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం మహేష్ తన 26వ చిత్రం ను అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ఒక యాడ్ షూట్ కోసం మహేష్ ముంబయి వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది.

ఎయిర్ పోర్ట్ లో చాలా సింపుల్ గా క్యాజువల్ డ్రస్ లో బ్లాక్ క్యాప్.. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని బ్లూ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుని నడుసుకుంటూ వెళ్లాడు. అక్కడ మహేష్ బాబును ఫొటోలు తీసేందుకు జనాలు ఎగబడ్డారు. అదే సమయంలో కొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ముచ్చట పడ్డారు. మహేష్ బాబు మాత్రం ఏం పట్టించుకోకుండా స్పీడ్ గా అక్కడ నుండి వెళ్లి పోయాడు.

ముంబయి ఎయిర్ పోర్ట్ లోని మహేష్ బాబు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ స్కిన్ టోన్ తో మహేష్ బాబు బ్లూ డ్రస్ లో అదిరిపోయాడు అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఇదే తరహా లుక్ తో కనిపించబోతున్నాడు. మహర్షిలో కాస్త గడ్డంతో కనిపించినా మళ్లీ మునుపటి లుక్ లోకే మహేష్ బాబు వచ్చాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా కీలక పాత్రలో విజయశాంతి నటిస్తున్న విషయం తెల్సిందే.
Please Read Disclaimer